అచ్చం Shah Rukh Khan లా ఉండే ఈ వ్యక్తికి షాకింగ్ అనుభవం.. మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్తే..

ABN , First Publish Date - 2022-05-06T23:23:30+05:30 IST

అచ్చం షారుఖ్ ఖాన్ లాగే కనిపించే ఇబ్రహీం ఖాద్రీని చూసి కింగ్ ఖాన్ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. గుజరాత్ కు చెందిన ఇబ్రహీం ఎస్ఆర్కే ప్రతిరూపంలానే ఉంటాడు. అందుకే, ఆయనకు ఇన్ స్టాగ్రామ్ లో భారీగా అనుచరులు ఉన్నారు. 122K ఫాలోయర్స్ కలిగిన Ibrahim Qadri రెగ్యులర్ గా Shah Rukh Khan సినిమాల్లోని ఆయన సీన్స్ ను రీక్రియేట్ చేస్తుంటాడు.

అచ్చం Shah Rukh Khan లా ఉండే ఈ వ్యక్తికి షాకింగ్ అనుభవం.. మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్తే..

అచ్చం షారుఖ్ ఖాన్ లాగే కనిపించే ఇబ్రహీం ఖాద్రీని చూసి కింగ్ ఖాన్ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. గుజరాత్ కు చెందిన ఇబ్రహీం ఎస్ఆర్కే ప్రతిరూపంలానే ఉంటాడు. అందుకే, ఆయనకు ఇన్ స్టాగ్రామ్ లో భారీగా అనుచరులు ఉన్నారు. 122K ఫాలోయర్స్ కలిగిన Ibrahim Qadri రెగ్యులర్ గా Shah Rukh Khan సినిమాల్లోని ఆయన సీన్స్ ను రీక్రియేట్ చేస్తుంటాడు. 


ఇబ్రహీం ఖాద్రీ కుటుంబంలోని వారు, స్నేహితులు అతడితో ఎప్పుడూ ‘నువ్వు షారుఖ్ లా ఉంటావ్’ అంటుంటారట. ఆయన తల్లిదండ్రులైతే కింగ్ ఖాన్ పోలికలతో తమకు కొడుకు పుట్టినందుకు ఎంతో గర్వపడేవారట. బాల్యం దాటుకుని యవ్వనంలోకి కాలుమోపాక ఖాద్రీ మరింతగా షారుఖ్ లా కనిపించటం మొదలు పెట్టాడట! 


బాలీవుడ్ బాద్షా లాంటి డూప్లికేట్ షారుఖ్ ఖాన్ తన గత అనుభవాల్ని కూడా చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో, జనం ఎలా తనని ఎస్ఆర్కే అనుకుంటూ ఉంటారో, ఇబ్రహీం ఉదాహరణలతో వివరించాడు. షారుఖ్ ‘రైస్’ మూవీ థియేటర్స్ లో ఉన్నప్పుడు ఆయన సినిమా చూసేందుకు వెళ్లాడట. ఆ సమయంలో థియేటర్ లో ఉన్న ప్రేక్షకులు ఇబ్రహీమ్ ని నిజమైన కింగ్ ఖాన్ అనుకుని సెల్ఫీల కోసం ఎగబడ్డారట. అతడ్ని ముందుకు కదలనీయకుండా చుట్టుముట్టేశారట. కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ లయన్స్ ఐపీఎల్ మ్యాచ్ కోసమని స్టేడియంకి వెళితే అక్కడా ఫ్యాన్స్ సెగ తప్పలేదు. షారుఖ్ అభిమానులు మీద పడిపోయారని ఇబ్రహీం ఖాద్రీ చెబుతున్నాడు. ఎంతగా పరిస్థితి అదుపు తప్పిందంటే... ఎవరో అతడి టీషర్ట్ గట్టిగా పట్టుకోవటంతో... అది చినిగిపోయిందట! అప్పుడుగానీ, బాలీవుడ్ బాద్షా ప్రతీ రోజు ఎలాంటి ఒత్తిడి ఎదుర్కుంటాడో తెలిసివచ్చిందట! 


జనం తనని చూసినప్పుడు ప్రదర్శించే ఉత్సాహమే తాను షారుఖ్ లాగా మరింతగా ప్రవర్తించటానికి కారణం అంటున్నాడు ఇబ్రహీం. కింగ్ ఖాన్ లాంటి మ్యానరిజమ్స్ ప్రదర్శించే ఆయన ఆన్ లైన్ లో భారీగా ఫాలోయర్స్ ని పోగేసుకున్నాడు. అందుకు, కారణం... ఇబ్రహీం చేసే ‘కింగ్ ఖాన్’ యాక్టింగే! అదే ఆయనకి సొషల్ మీడియా వెలుపల కూడా అవకాశాల్ని తెచ్చి పెడుతోంది. ఇబ్రహీం ఇంత వరకూ ప్రత్యేక అతిథిగా పలు పెళ్లిల్లకు హాజరయ్యాడు. ‘ఛయ ఛయ్యా...’ పాట మీద స్టెప్పులేస్తుంటాడు. అయితే, షారుఖ్ లాంటి తనని కలవటానికి ఎందరో ఆరాటపడుతోన్నా... ఇబ్రహీం ఖాద్రీకి మాత్రం బాద్షా ఆఫ్ బాలీవుడ్ ని ఒక్కసారి నేరుగా కలవాలని చిరకాల కోరిక! అదైతే ఇంకా నెరవేరలేదు... 


షారుఖ్, ఇబ్రహీం మధ్య పోలికల విషయంలో చాలా మంది నెటిజన్స్ ఆశ్చర్యపోతూనే ఉన్నారు. సొషల్ మీడియాలో చాలా మంది ‘‘నేను షారుఖ్ ఖానే అనుకున్నాను...’’ అంటూ కామెంట్స్ చేయటం సర్వసాధారణమైపోయింది!


ఇబ్రహీం ఖాద్రీ అలియాస్ కొసరు షారుఖ్ సంగతెలా ఉన్నా... అసలు ఖాన్ మాత్రం త్వరలో ‘పఠాన్’గా రాబోతున్నాడు. ఆ తరువాత రాజు హిరానీ ‘దున్కి’ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ లోపు ఎస్ఆర్కే తమిళ దర్శకుడు అట్లీతో కూడా ఓ సినిమా పూర్తి చేసేస్తున్నాడు. చూడాలి మరి, రియల్ ఎస్ఆర్కే ముందు, ముందు మనల్ని ఎలా అలరిస్తాడో...

Updated Date - 2022-05-06T23:23:30+05:30 IST