షారుఖ్ ఖాన్ బంగ్లా ‘మన్నత్’కి కొత్త నేమ్‌ప్లేట్.. ధర విని షాక్ అవుతున్న జనాలు

ABN , First Publish Date - 2022-04-26T19:54:39+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్‌కి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. అందుకే ఈ నటుడు ఏ సినిమా తీస్తున్న..

షారుఖ్ ఖాన్ బంగ్లా ‘మన్నత్’కి కొత్త నేమ్‌ప్లేట్.. ధర విని షాక్ అవుతున్న జనాలు

బాలీవుడ్ స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్‌కి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. అందుకే ఈ నటుడు ఏ సినిమా తీస్తున్న మంచి బజ్ క్రియేట్ అవుతుంటుంది. తాజాగా ఆయనకి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం బీ టౌన్‌లో హల్‌చల్ చేస్తోంది. అది ఆయన సినిమాల గురించి కాదు. షారుఖ్ నివసించే బంగ్లా ‘మన్నత్’కి తాజాగా ఏర్పాటు చేసిన కొత్త నేమ్‌ప్లేట్‌ గురించి. దానికి కారణం ఆ నేమ్‌ప్లేట్‌ ధర.


షారుఖ్ భార్య గౌరీ ఖాన్ సొంతంగా మంచి డిజైనర్. అందుకే ఈ నేమ్‌ప్లేట్‌ని దగ్గరుండి ఈ డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. అది క్లాస్‌గా, మరోవైపు మన్నత్ ఖ్యాతిని పెంచేలా డిజైన్ చేయించింది. ప్రముఖ డిజైనర్ తయారు చేసిన ఆ నేమ్‌ప్లేట్ ధరకి రూ.25 లక్షలు అయ్యిందట. అయితే.. ఈ విషయంలో షారుక్ ఏ విధంగా ఇన్‌వాల్వ్ కాలేదంట. ఆమె చేసిన డిజైన్‌ని కుటుంబంలోని అందరూ ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. అంతేకాకుండా.. ఈ నేమ్‌ప్లేట్ పిక్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఎంతోమంది సినీ జనాలు దీని గురించి కామెంట్స్ చేస్తున్నారు. మన్నత్ నేమ్‌ప్లేట్‌కి పెట్టిన ఖర్చుతో ఓ కొత్త కారునే కొనుక్కోవచ్చని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-04-26T19:54:39+05:30 IST