Shah Rukh Khan నుంచి Suriya వరకు టాప్ తారలు అతిథి పాత్రల్లో నటిస్తున్న 5 భారీ సినిమాలివీ..!

ABN , First Publish Date - 2022-06-16T23:28:51+05:30 IST

హీరో, హీరోయిన్స్ సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించడం సహజమే. వారు ఎన్నో ఏళ్లుగా చిత్రాల్లో తళుక్కుమంటున్నారు. 5నిమిషాలు నటించిన సరే మూవీని మలుపు తిప్పే పాత్రల్లో వీరు కనిపిస్తారు. హీరో,

Shah Rukh Khan నుంచి Suriya వరకు టాప్ తారలు అతిథి పాత్రల్లో నటిస్తున్న 5 భారీ సినిమాలివీ..!

హీరో, హీరోయిన్స్ సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించడం సహజమే. వారు ఎన్నో ఏళ్లుగా చిత్రాల్లో తళుక్కుమంటున్నారు. 5నిమిషాలు నటించిన సరే మూవీని మలుపు తిప్పే పాత్రల్లో వీరు కనిపిస్తారు. హీరో, హీరోయిన్ అతిథి పాత్రల్లో కనిపిస్తే సినిమాకు కూడా ప్రచారం లభిస్తుంది. కొంచెం వసూళ్లు కూడా రాబట్టవచ్చు. బాలీవుడ్‌లో కూడా పలువురు తారలు మూవీస్‌లో గెస్ట్ పాత్రల్లో కనిపిస్తున్నారు. అలా టాప్ తారలు అతిథి పాత్రల్లో నటిస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దామా..


షారూఖ్ ఖాన్ ‘బ్రహ్మాస్త్ర’ (Shah Rukh Khan (Brahmastra)):

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్( Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. కరణ్ జోహార్(Karan Johar) నిర్మాతగా వ్యవహరించాడు. పాన్ ఇండియాగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ‘వాయువు’ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, చిత్ర బృందం మాత్రం షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్టు అధికారికంగా తెలపలేదు. 


దీపికా పదుకొణె ‘బ్రహ్మాస్త్ర’ (Deepika Padukone (Brahmastra)):

బాలీవుడ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమిస్తూ పాన్ ఇండియాగా రూపొందించారు. ‘బ్రహ్మాస్త్ర’లో దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో జల్ దేవిగా ఆమె దర్శనమివ్వబోతుందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. 


సల్మాన్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ (Salman Khan (Laal Singh Chaddha))

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. బీ టౌన్ లో భారీగా పారితోషికం తీసుకునే హీరోల్లో అతనొకరు. ఆమిర్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. షారూఖ్ ఖాన్ కూడా తళుక్కుమనబోతున్నాడట. ఇదే కనుక నిజమైతే ముగ్గురు ఖాన్‌లను ఒకేసారి వెండి తెర మీద ప్రేక్షకులు చూడొచ్చు. 


సూర్య ‘సూరరై పొట్రు రీమేక్’ (Suriya (Soorarai Potru remake))

తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో సూర్య ఒకరు. అతడు నటించిన హిట్ సినిమా ‘సూరరై పొట్రు’.  ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 


దీపికా పదుకొణె ‘సర్కస్’ (Deepika Padukone (Cirkus))

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి దీపికా పదుకొణె. ‘ప్రాజెక్ట్-కె’ తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘సర్కస్’ లో ఆమె అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2022-06-16T23:28:51+05:30 IST