ఆర్యన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు అధికారి సమీర్ వాంఖడే‌పై లీగల్ యాక్షన్..?

ABN , First Publish Date - 2021-11-22T22:54:22+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆర్యన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా

ఆర్యన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు అధికారి సమీర్ వాంఖడే‌పై లీగల్ యాక్షన్..?

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆర్యన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కు చెందిన  ప్రత్యేక కోర్టు ఆ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం ముంబై హైకోర్టు మెట్లెక్కి అతడు బెయిల్‌ను తెచ్చుకున్నాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన కొడుకును అరెస్టు చేసినందుకు సమీర్ వాంఖడే పైన లీగల్ యాక్షన్ తీసుకోవాలని షారూక్ ఖాన్ యోచిస్తున్నట్టు సమాచారం.


ముంబైలోని క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా అక్టోబర్ 3న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో యాక్ట్‌లోని సెక్షన్ 8(సి), సెక్షన్ 20(బి), సెక్షన్ 27, సెక్షన్ 35 కింద అతడి పైన కేసు నమోదు చేశారు. అనంతరం షారూక్ తనయుడు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా ఎన్సీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో అతడు ముంబై హైకోర్టు మెట్లెక్కి షరతులతో కూడిన బెయిల్‌ను అక్టోబర్ 28న సంపాదించాడు. ఆర్యన్ వద్ద ఎటువంటి మాదక ద్రవ్యాలు లభించకపోవడంతో అతడికి బెయిల్ లభించింది.  


ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ అయిన సమీర్ వాంఖడే పైన లీగల్ యాక్షన్ తీసుకోవాలని షారూక్ ఖాన్‌కు అతడి లాయర్లు సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ‘‘ ఆర్యన్ జైలులో ఉండటానికి కారణమైన సమీర్ వాంఖడే పైన చర్యలు తీసుకోవాలని కింగ్ ఖాన్ యోచిస్తున్నారు ’’ అని  షారూక్ సంబంధిత వ్యక్తి ఒకరు చెప్పారు. ఈ వార్తలపై షారూక్ ఇంత వరకు స్పందించలేదు.

Updated Date - 2021-11-22T22:54:22+05:30 IST