ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన Shah Rukh Khan.. Bollywood లోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా..

ABN , First Publish Date - 2022-06-25T20:27:30+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). ఆనంద్ ఎల్. రాయ్ తెరకెక్కించిన ‘జీరో’ సినిమాలో చివరగా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన Shah Rukh Khan.. Bollywood లోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). ఆనంద్ ఎల్. రాయ్ తెరకెక్కించిన ‘జీరో’ సినిమాలో చివరగా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో కొంచెం నెమ్మదించారు. కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో కూడా కొంత కాలం సతమతమయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ‘పఠాన్’ (Pathaan), ‘జవాన్’, ‘డంకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూవీస్ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.    


షారూఖ్ ఖాన్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తాను నటిస్తున్న ‘పఠాన్’ ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఓ మెసేజ్‌ను కూడా షేర్ చేశారు. ‘‘మీ అనంతమైన ప్రేమ, నవ్వులు నా వెన్నంటే ఉండటంతో 30ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ‘పఠాన్’ తో నా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 25న మీకు దగ్గరల్లోని థియేటర్‌లో కలుద్దాం’’ అని షారూఖ్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘పఠాన్’ సినిమాను యశ్‌రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. సిద్దార్థ్ ఆనంద్ (SiddharthAnand) దర్శకత్వం వహించారు. దీపికా పదుకొణె (deepikapadukone), జాన్ అబ్రహం (johnabraham)కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగులో విడుదల కానుంది.



Updated Date - 2022-06-25T20:27:30+05:30 IST