తమిళ సినిమా Beast పై.. Shah Rukh Khan కామెంట్స్.. విజయ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-04-06T22:15:56+05:30 IST

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన సినిమా ‘బీస్ట్’. ఏప్రిల్ 13న విడుదల కానుంది.

తమిళ సినిమా Beast పై.. Shah Rukh Khan కామెంట్స్.. విజయ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదీ..!

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన సినిమా ‘బీస్ట్’. ఏప్రిల్ 13న విడుదల కానుంది. షారూఖ్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. చిత్ర బృందానికీ శుభాకాంక్షలు చెప్పాడు. 


బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ట్విట్టర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను షేర్ చేశాడు. ట్రైలర్‌పై కామెంట్ చేశాడు. ‘‘ప్రస్తుతం నేను డైరెక్టర్ అట్లీతో కూర్చున్నాను. నాలాగే, అతడు కూడా విజయ్‌కి పెద్ద అభిమాని. ‘బీస్ట్’ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు. ట్రైలర్ అద్భుతంగా ఉంది’’ అని కింగ్ ఖాన్ ట్వీట్ చేశాడు. షారూక్ ‘బీస్ట్’ ట్రైలర్‌ను షేర్ చేయడంతో విజయ్ అభిమానులందరూ సంతోషంలో మునిగిపోయారు. ‘‘ట్రైలర్‌పై మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు  థ్యాంక్ యూ షారూఖ్. త్వరలో మీరిద్దరూ కలసి సినిమా చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ‘‘ఇద్దరి నటుల అభిమానులందరికి ఇవి అద్భుతమైన క్షణాలు. థ్యాంక్ యూ కింగ్ ఖాన్’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ స్పందించాడు. షారూఖ్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తున్న ‘లయన్‌లో’  హీరోగా నటిస్తున్నాడు.


ఇళయదలపతి విజయ్ ‘బీస్ట్’లో ఇండియన్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నాడు. వీర రాఘవ అనే పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమా తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. ‘బీస్ట్’ ట్రైలర్ ఈ మధ్యనే విడుదలై నెట్టింట రికార్డులు సృష్టించింది. యూట్యూబ్ రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రానికీ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు.



Updated Date - 2022-04-06T22:15:56+05:30 IST