Boycott Bollywood: బ్రహ్మాస్త్ర సినిమా కొత్త ప్రోమోపై మరోసారి విరుచుకుపడిన నెటిజన్లు..!

ABN , First Publish Date - 2022-09-02T18:50:47+05:30 IST

బాయ్‌కాట్ ట్రెండ్‌తో బాలీవుడ్ అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం పడి ఇప్పటికే స్టార్ హీరోలు..

Boycott Bollywood: బ్రహ్మాస్త్ర సినిమా కొత్త ప్రోమోపై మరోసారి విరుచుకుపడిన నెటిజన్లు..!

బాయ్‌కాట్ ట్రెండ్‌తో బాలీవుడ్ అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం పడి ఇప్పటికే స్టార్ హీరోలు ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ ఫ్లాప్స్‌గా మిగిలిపోయాయి. పెట్టిన పెట్టుబడిలో సగం కలెక్షన్లను కూడా రాబట్టలేని స్థితికి వెళ్లిపోయాయి. అనంతరం మరో భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మస్త్ర(Brahmastra)’కి కూడా ఈ బాయ్‌కాట్ సెగ తగిలింది. ఈ మూవీ హీరో హీరోయిన్లైన రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) స్టార్ కిడ్స్ కావడం.. నచ్చకపోతే సినిమా చూడకండని ఆలియా పొగరుగా మాట్లాడడం.. నెపోటిజాన్ని ఎంకరేజ్ చేసే కరణ్ జోహార్ నిర్మాత కావడంతో ఈ సినిమాని కూడా బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ చేశారు. 


అయితే.. అప్పటినుంచి దాని నుంచి బయట పడేందుకు మూవీ టీం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలోనే తాజాగా షారుఖ్ ఖాన్  గెస్ట్‌గా నటించిన వానరాస్త్ర‌కి సంబంధించిన ప్రొమోని చిత్రబృందం విడుదల చేసింది. దీంతో మరోసారి Boycott Bollywood తెరమీదకి వచ్చింది. షారుఖ్ ఖాన్ ముఖం చూపించనప్పటికీ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. దీంతో ఈ ప్రొమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. బాయ్‌కాట్ చేయాలంటూ పోస్టులు పెట్టారు.


కాగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ సైతం ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం 9 సెప్టెంబర్ 2022 న విడుదల కానుంది. కాగా కొత్త ప్రొమోలో వినిపించే వాయిస్ దీపికా పదుకొనే అయ్యి ఉంటుందని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె జల్ దేవి పాత్రలో కనిపించనుందని సమాచారం.

Updated Date - 2022-09-02T18:50:47+05:30 IST