ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో షారుఖ్ ఖాన్ బంగ్లా ‘మన్నత్’ నేమ్‌ప్లేట్.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-04-24T18:28:12+05:30 IST

బాలీవుడ్‌లో క్రేజీ స్టార్‌డమ్ ఉన్న నటుల్లో షారుఖ్ ఖాన్ ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి..

ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో షారుఖ్ ఖాన్ బంగ్లా ‘మన్నత్’ నేమ్‌ప్లేట్.. కారణం ఇదే..

బాలీవుడ్‌లో క్రేజీ స్టార్‌డమ్ ఉన్న నటుల్లో షారుఖ్ ఖాన్ ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి మంచి కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగిన షారుఖ్ గత కొంత కాలంగా వస్తున్న ఫ్లాపుల కారణంగా కొంచెం నెమ్మదించాడు. అయితే.. ఆయన సినిమాలే కాకుండా ముంబైలోని ఈ నటుడి బంగ్లా ‘మన్నత్’ కూడా చాలా ఫేమస్. తాజాగా ఈ బంగ్లా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


షారుఖ్ తన బంగ్లా ‘మన్నత్’కి సంబంధించిన నేమ్‌ప్లేట్‌తో కాలానికి అనుగుణంగా మార్పులు చేస్తూ వస్తున్నాడు. దానికి సంబంధించిన పిక్స్ ఓ అభిమాని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అందులో.. ‘మన్నత్’ పేరుని మొదట చెక్కపై, కొద్దికాలనికి బ్లాక్ బోర్డుపై, కొత్తగా నల్లరాతిపై చెక్కించారు.  ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన ఆ పిక్స్‌పై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది ఎప్పటికీ ఐకానిక్ డిజైన్. అది కూడా షారుఖ్‌లాగా సింపుల్, నిరాడంబరం, క్లాస్‌గా ఉంటుంది. అయితే నిజాయతీగా మాట్లాడాలంటే కొత్తది అంతగా నచ్చలేదు’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.


అలాగే.. ‘ఇది మన్నత్ కొత్త నేమ్‌ప్లేట్. మన్నత్ అంటే స్టార్ డమ్, ప్రేమ, ఎమోషన్, ప్యాషన్, కష్టపడేతత్వం, నిబద్ధతకి గుర్తు’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ‘మన్నత్ అంటే స్వర్గం. షారుఖ్ ఖాన్ బంగ్లా నేమ్‌ప్లేట్ కూడా ట్రెండ్ అవుతుందంటేనే.. ఆయనంటే ప్రేక్షకులకి ఉన్న అభిమానం ఎంటో తెలుస్తోంది’ అనిమ ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. మన్నత్ నేమ్‌ప్లేట్ మార్పుపై కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.



Updated Date - 2022-04-24T18:28:12+05:30 IST