‘జవాన్’ గా వచ్చేస్తున్న Shah Rukh Khan.. టీజర్ ఔట్..

ABN , First Publish Date - 2022-06-03T20:48:52+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). చివరగా ‘జీరో’ సినిమాలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో కొంచెం బ్రేక్ తీసుకున్నాడు.

‘జవాన్’ గా వచ్చేస్తున్న Shah Rukh Khan.. టీజర్ ఔట్..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). చివరగా ‘జీరో’ సినిమాలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. నాలుగేళ్లుగా ఎటువంటి సినిమా చేయలేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో కింగ్ ఖాన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ మూవీ షూటింగ్ జరుపుకొంటుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌తో పాటు విడుదల తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను  విడుదల చేశారు.     


షారూఖ్ సినిమాకు ‘జవాన్’ అని టైటిల్‌ పెట్టారు. 2023 జూన్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియాగా ఈ సినిమా రూపొందింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. షారూఖ్ సొంత నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఈ చిత్రాన్ని నిర్మించింది. నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తూ అట్లీ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘మిమ్మల్ని అభిమానిస్తూ పెరిగాను. కానీ, మిమ్మల్ని డైరెక్షన్ చేస్తానని కలలో కూడా ఊహించలేదు’’ అని అట్లీ చెప్పాడు. 





Updated Date - 2022-06-03T20:48:52+05:30 IST