Video Viral: గుర్తుపట్టేసిన అభిమానులు.. పరుగులు పెట్టిన షారుఖ్ ఖాన్

ABN , First Publish Date - 2022-07-24T14:41:23+05:30 IST

సినిమా స్టార్స్ అంటే జనాలకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. స్టార్ హీరోల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం..

Video Viral: గుర్తుపట్టేసిన అభిమానులు.. పరుగులు పెట్టిన షారుఖ్ ఖాన్

సినిమా స్టార్స్ అంటే జనాలకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. స్టార్ హీరోల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమాన నటులు ఎక్కడ కనపడిన ఫ్యాన్స్ వెంటబడి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. అయితే.. వారి అభిమానం కొన్నిసార్లు నటులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. 


షారుక్‌కి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ నటుడు ఇప్పటికే ‘పఠాన్ (Pathaan)’ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. కాగా.. ఈయన ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హీరానీ దర్శకత్వంలో ‘డుంకీ (dunki)’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో తాప్సీ పన్ను (Tapsee Pannu) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతుంది. ఈ షూటింగ్ సందర్భంగా ఆయనని పలువురు ఫ్యాన్స్ గుర్తుపట్టి సెల్ఫీలకోసం ఆయన దగ్గరకి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో షారుఖ్ పరుగెత్తుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అయితే.. ఈ వీడియోలో షారుఖ్ చాలా పొట్టిగా కనిపించాడు. దీంతో వీడియోలో ఉన్నది షారుఖ్ కాదనుకుంటా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. షారుఖ్ నటించిన ‘పఠాన్’ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. అలాగే.. ‘డుంకీ’ సైతం డిసెంబర్, 2023లో విడుదల కానుంది. అంతేకాకుండా.. ఈ స్టార్ హీరో తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.





Updated Date - 2022-07-24T14:41:23+05:30 IST