Shaakunthalam : విడుదల మరింత ఆలస్యం !

ABN , First Publish Date - 2022-08-02T23:32:11+05:30 IST

సమంత (Samantha) తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ (Shaakunthalam). మహాభారతం ద్వితీయాశ్వాసంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయ ఘట్టా్న్ని గుణశేఖర్ (Gunasekhar) వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు.

Shaakunthalam : విడుదల మరింత ఆలస్యం !

సమంత (Samantha) తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ (Shaakunthalam). మహాభారతం ద్వితీయాశ్వాసంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయ ఘట్టాన్ని గుణశేఖర్ (Gunasekhar) వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ తనయ నీలిమా గుణ (Neelima Guna) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Manisharma) సంగీతం అందిస్తున్నారు. యువ మలయాళ నటుడు దేవ్ కమల్ (Dev Kamal) దుష్యంతుడిగా నటిస్తుండగా.. విలక్షణ నటుడు మోహన్ బాబు (Mohanbabu) దుర్వాస మహాముని పాత్రను పోషిస్తున్నారు.  కబీర్ దుహాన్ సింగ్ (Kabeer Duhan Singh) రాక్షసుడిగా కనిపించబోతున్నాడు. ఇంకా అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ (Arha).. బాల భారతుడిగా నటిస్తోంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సీజీ వర్క్ జరుపుకుంటోంది. దీని కారణంగానే సినిమా మరింత లేటయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని నిర్మాత నీలిమా గుణ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు. 


‘శాకుంతలం’ చిత్రం గురించి అప్డేట్స్ కోరుతూ ట్వీట్ చేస్తున్న అభిమానులందరికీ తెలియజేసేది ఏంటంటే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మీకు మంచి ఔట్ పుట్‌ను అందించడానికి మేము సిద్ధమవుతున్నాము. సంక్లిష్టమైన సీజీ వర్క్‌ను క్వాలిటీతో అందించడానికి ప్రిపేర్ అవుతున్నాం. అందుకే టైమ్ తీసుకుంటోంది. ఇలాంటి కీలక సమయంలో మీ మద్దతును కోరుతున్నాం. వీలైనప్పుడు మేం మరిన్ని అప్డేట్స్ అందిస్తాం’.. అంటూ నీలిమా గుణ ట్వీట్ చేశారు. దాంతో ఈ సినిమా విడుదలకు మరింత సమయం పట్టవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.


ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టుగానే ‘శాకుంతలం’ చిత్రాన్ని విజువల్ గా అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు గుణశేఖర్. ఈ మధ్యకాలంలో ‘బాహుబలి’ (Bahubali) లాంటి జానపదం, ‘రుద్రమదేవి’ (Rudramadevi) లాంటి చారిత్రక చిత్రాలు వచ్చాయి కానీ..  ఇలా పూర్తి స్థాయి పౌరాణిక చిత్రం అసలు రాలేదు. అందుకే ‘శాకుంతలం’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శకుంతలగా సమంత ఎలా ఉండబోతోందనే ఆత్రుత అభిమానుల్లో అంతకంతకూ పెరుగుతోంది. మరి ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఎప్పటికి పూర్తవుతుందో, సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి. 

Updated Date - 2022-08-02T23:32:11+05:30 IST