God father: గాడ్ ఫాదర్ సీక్వెల్ కూడా వుంది

ABN , First Publish Date - 2022-10-01T22:02:23+05:30 IST

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ కి సీక్వెల్ వుందా అన్న ప్రశ్నకు చిరంజీవి ఉండొచ్చు అనే సమాధానం చెప్పారు. ముంబై లో గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ విడుదల సందర్భంగా అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చిరంజీవి సీక్వెల్ ఉంటుందేమో అని చెప్పారు.

God father: గాడ్ ఫాదర్ సీక్వెల్ కూడా వుంది

చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్ ఫాదర్ (God Father) కి సీక్వెల్ (Sequel) వుందా అన్న ప్రశ్నకు చిరంజీవి ఉండొచ్చు అనే సమాధానం చెప్పారు. ముంబై లో గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ (Hindi Trailer) విడుదల సందర్భంగా అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చిరంజీవి సీక్వెల్ ఉంటుందేమో అని చెప్పారు. సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక, సినిమా లాస్ట్ పార్ట్ చూశాడట. అందులో కొన్ని సీన్స్ దర్శకుడు మోహన్ రాజా సస్పెన్స్ గా పెట్టాడట. అక్కడ ఇంటర్పోల్ ఇంకా ఏవేవో మాట్లాడుతుంటూ, ఏంటి దీనికి ఏమైనా సీక్వెల్ వుందా అని దర్శకుడిని చిరంజీవి అడిగాడట. ఏమో తెలీదు అని దర్శకుడు మోహన్ రాజా (Director Mohan Raja) చెప్పాడట. కానీ చిరంజీవి మలయాళం సినిమా దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ (Prudhviraj Sukumaran) తో మాట్లాడితే, అతని కథ రెడీ గా వుంది, వచ్చి చెప్తా, మీకు ఇంటరెస్ట్ ఉంటే తీయొచ్చు అని చెప్పాడట. అందుకని ఈ సినిమాకి సీక్వెల్ ఉండొచ్చు అని చెప్తున్నాడు చిరంజీవి. ఒకవేళ సీక్వెల్ ఉంటే, అందులో కూడా మళ్ళీ సల్మాన్ ఖాన్ నటిస్తాడేమో. ఎందుకంటే ఇందులో ఉంటే ఆ రెండు ప్రధాన పాత్రలు కంటిన్యూ అవ్వాలి కదా. అందుకని సీక్వెల్ లో ఈ ఇద్దరు మళ్ళీ కలవబోతున్నారు

Updated Date - 2022-10-01T22:02:23+05:30 IST