సినిమా అవకాశాల్లేక సబ్బులమ్ముకుంటున్నా: సీనియర్‌ నటి లక్ష్మీ కుమార్తె ఐశ్వర్య

ABN , First Publish Date - 2022-06-17T03:19:23+05:30 IST

సీనియర్‌ సినీ నటి లక్ష్మి కుమార్తె, నటి ఐశ్వర్య ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా రోజువారీ పోషణ కోసం తాను సబ్బులు అమ్ముకుంటున్నట్లు ఐశ్వర్య ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుమారుగా 200 చిత్రాల్లో

సినిమా అవకాశాల్లేక సబ్బులమ్ముకుంటున్నా: సీనియర్‌ నటి లక్ష్మీ కుమార్తె ఐశ్వర్య

సీనియర్‌ సినీ నటి లక్ష్మి (Lakshmi) కుమార్తె, నటి ఐశ్వర్య (Aishwarya) ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా రోజువారీ పోషణ కోసం తాను సబ్బులు అమ్ముకుంటున్నట్లు ఐశ్వర్య ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుమారుగా 200 చిత్రాల్లో నటించిన ఐశ్వర్య ‘న్యాయంగళల్‌ జయిక్కట్టుం’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమె అనేక చిత్రాల్లో నటించారు. హీరోయిన్ వేషాలు లేకపోయినప్పటికీ చిన్నచిన్న పాత్రల్లో కూడా కనిపించారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక కష్టాలను వెల్లడించారు. ఇల్లు గడవడం కష్టం కావడంతో ఇంటింటికి వెళ్ళి సబ్బులు విక్రయిస్తున్నట్టు చెప్పారు. 


‘‘ఇప్పుడు నాకు పని లేదు. ఆదాయం లేదు. ఇల్లు గడవాలంటే పని కావాలి. పని లేకపోవడంతో ఇంటింటికి వెళ్లి సబ్బులు విక్రయిస్తున్నాను. మంచి వేతనం ఇస్తే పాచి పనులు కూడా చేసేందుకు సిద్ధం. ఇప్పుడు నేను చేస్తున్న పని ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు అప్పులు లేవు. ఇతర సమస్యలు కూడా లేవు. కానీ, సరైన పని ఒక్కటే లేదు. నా కాళ్ళపై నిలబడి స్వశక్తితో జీవిస్తున్నానని గర్వంగా వుంది. నేను నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నాను. యోగా సాధన వల్ల కేవలం ఒక్క పూట మాత్రమే భుజిస్తున్నాను. నా ఆర్థిక స్థితిగతులు మారాలంటే ఖచ్చితంగా నాకు ఒక మెగా టీవీ సీరియల్‌ కావాలి. నేను బతికింది సీరియల్స్‌ ద్వారానే. సినిమాల వల్ల కాదు. నాకు సినిమాలు అన్నం పెట్టలేదు. బుల్లితెర మాత్రమే అన్నం పెట్టింది’’ అంటూ ఐశ్వర్య కన్నీంటి పర్యంతమయ్యారు.

Updated Date - 2022-06-17T03:19:23+05:30 IST