గుండెపోటుతో సీనియర్‌ నటుడు మృతి

ABN , First Publish Date - 2022-04-24T15:24:44+05:30 IST

తమిళ సీనియర్‌ నటుడు చక్రవర్తి (62) శనివారం ముంబైలో గుండెపోటుతో మృతి చెందారు. శివాజీ గణేశన్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి అనేక మంది నటీనటులు

గుండెపోటుతో సీనియర్‌ నటుడు మృతి

అడయార్‌(చెన్నై): తమిళ సీనియర్‌ నటుడు చక్రవర్తి (62) శనివారం ముంబైలో గుండెపోటుతో మృతి చెందారు. శివాజీ గణేశన్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి అనేక మంది నటీనటులు నటించిన 80కి పైగా చిత్రాల్లో చక్రవర్తి నటించారు. ‘రిషి’ అనే చిత్రం ద్వారా శివాజీ గణేశన్‌తో కలిసి తొలిసారి నటించారు. ఈయన సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత ముంబైలో ఉంటున్నారు. సోనీ స్టార్‌ స్పోర్ట్స్‌ చానెల్‌లో వ్యాఖ్యాతగా పనిచేస్తూ వచ్చారు. చక్రవర్తికి  శనివారం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య లలిత, శశికుమార్‌, అజయ్‌కుమార్‌ అనే కుమారులున్నారు. 

Updated Date - 2022-04-24T15:24:44+05:30 IST