తమ్ముడికి... విలన్‌గా మారిన అన్న!

ABN , First Publish Date - 2022-03-07T02:08:01+05:30 IST

కొత్త రకం సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్

తమ్ముడికి... విలన్‌గా మారిన అన్న!

కొత్త రకం సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్. ‘7/జీ బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘ఎన్‌జీకే’ వంటి విలక్షణ సినిమాలకు దర్శకత్వం వహించాడు. అతడికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 


‘సాని కాయితం’ చిత్రంతో సెల్వరాఘవన్ నటుడిగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా విడుదల కాకముందే అతడికి అవకాశాలు వెలువెత్తుతున్నాయి. విజయ్ ‘బీస్ట్’లోనూ నటించాడు. మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. మార్చి 5న సెల్వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్. థాను అతడికి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పాడు. ‘నానే వరువెన్’ సినిమా పోస్టర్‌ను షేర్ చేశాడు. ‘‘దర్శకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సెల్వ రాఘవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. అటువంటి ఉన్నత శిఖరాలను నటనలోనూ అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అని కలైపులి ఎస్.థాను కామెంట్ చేశాడు. ఈ పోస్ట్‌కు సెల్వ స్పందించాడు. ‘‘థ్యాంక్ యూ సో మచ్ సర్’’ అని రిప్లై ఇచ్చాడు.  


‘నానే వరువెన్’ చిత్రానికి సెల్వ రాఘవనే దర్వకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్... ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తమ్ముడు హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో అన్న నెగెటివ్ రోల్‌లో కనిపించనుండటం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చగా మారింది. చిత్రంపై భారీ అంచనాలు సృష్టిస్తోంది.  ఈ మూవీలో ధనుష్ సరసన ఇందుజా రవిచంద్రన్ కథనాయికగా నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.        



Updated Date - 2022-03-07T02:08:01+05:30 IST