దీపికను అనుకరిస్తూ చిన్నారి వీడియో.. రణ్‌వీర్ సింగ్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-02-10T17:07:50+05:30 IST

బాలీవుడ్ నటీమణుల్లో దీపిక పదుకొనేకి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అందుకే ఎంతోమంది ఆమె అభిమానులు ఈ బ్యూటీ సినిమా డైలాగ్స్‌తో షార్ట్ వీడియోస్ చేస్తుంటారు...

దీపికను అనుకరిస్తూ చిన్నారి వీడియో.. రణ్‌వీర్ సింగ్ రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్ నటీమణుల్లో దీపిక పదుకొనేకి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అందుకే ఎంతోమంది ఆమె అభిమానులు ఈ బ్యూటీ సినిమా డైలాగ్స్‌తో షార్ట్ వీడియోస్ చేస్తుంటారు. తాజాగా దీపిక, రణ్‌వీర్ సింగ్ నటించిన ‘రామ్‌లీలా‌’లోని ఓ పాపులర్ డైలాగ్‌కి రాశి అనే చిన్నారి వీడియో చేసింది. అందులో సినిమాలోని లీలాలాగే డ్రెస్ సైతం వేసుకుంది. 


ఆ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారిపోయింది. దీనికి దీపిక భర్త, బాలీవుడ్ యువ నటుడు రణ్‌వీర్ సింగ్ ఫిదా అయిపోయాడు. దీంతో ఆ వీడియోని షేర్ చేసి ‘లీలాలాగా ఎవరూ ఉండరు. దీపిక నీ చిన్నప్పటి వెర్షన్‌ని చూడు. ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయి’ అంటూ క్యాప్షన్ సైతం రాసుకొచ్చాడు.


రణ్‌వీర్ తన పోస్ట్ షేర్ చేయడం చూసిన రాశి.. ‘ఓ మై గాడ్.. నేను ఇది నమ్మలేకపోతున్నా. నా వీడియోని చూసి, మెచ్చుకున్నందుకు థ్యాంక్యూ రణ్‌వీర్ సర్. మీకు, దీపిక మేడమ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. బాలీవుడ్ యంగ్ హీరో షేర్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ సైతం ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-02-10T17:07:50+05:30 IST