అతడికి 61... ఆమెకి 30... Lockdownలో పెళ్లి, రెండేళ్లకే Divorce!

ABN , First Publish Date - 2022-04-25T16:53:58+05:30 IST

60 ఏళ్ల సీన్, 30 ఏళ్ల లెయ్‌లా జార్జ్ 2016 నుంచీ ప్రేమలో మునిగితేలుతున్నారు. కాకపోతే, 2020లో ‘కరోనా కళ్యాణం‘తో అధికారికంగా ఒక్కటయ్యారు. ఇప్పుడు ఎందుకు విడిపోయారన్నది వారు చెప్పలేదుగానీ... గత కొన్ని రోజులుగా...

అతడికి 61... ఆమెకి 30... Lockdownలో పెళ్లి, రెండేళ్లకే Divorce!

హాలీవుడ్ స్టార్స్ సీన్ పెన్, లెయ్‌లా జార్జ్ అధికారికంగా విడాకులు తీసుకున్నట్టు ప్రకటించేశారు. 61 ఏళ్ల సీన్‌ని 30 ఏళ్ల లెయ్‌లా దాదాపు రెండేళ్ల క్రితం జూలై 2020లో పెళ్లాడింది. అయితే, అప్పట్లో కరోనా కలకలం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉండటంతో వారిద్దరి వెడ్డింగ్ లాక్‌డౌన్‌లోనే జరిగింది. అదే విషయం పెళ్లికి నెల తరువాత సీన్ పెన్ ఓ టాక్ షోలో వెల్లడించాడు. జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సంబంధిత అధికారి తమ ‘కోవిడ్ వెడ్డింగ్’ ఆన్‌లైన్‌లోనే జరిపించాడని పెన్ ఇంటర్వ్యూలో తెలిపాడు. 


60 ఏళ్ల సీన్, 30 ఏళ్ల లెయ్‌లా జార్జ్ 2016 నుంచీ ప్రేమలో మునిగితేలుతున్నారు. కాకపోతే, 2020లో ‘కరోనా కళ్యాణం‘తో అధికారికంగా ఒక్కటయ్యారు. ఇప్పుడు ఎందుకు విడిపోయారన్నది వారు చెప్పలేదుగానీ... గత కొన్ని రోజులుగా పెన్ యుద్ధంతో అతలాకుతలం అవుతోన్న యుక్రెయిన్‌లో ఉంటున్నాడు. ఓ డాక్యుమెంటరీ రూపొందించాడు. అమెరికాకి తిరిగి వచ్చి లెయ్‌లాతో డైవోర్స్ తతంగం పూర్తి చేసిన ఆయన మళ్లీ యుక్రెయిన్ వెళతాడని అంటున్నారు. ఈసారి నేరుగా రష్యాకి వ్యతిరేకంగా ఆయుధం పట్టి యుద్ధం చేయబోతున్నాడని సమాచారం...     

Updated Date - 2022-04-25T16:53:58+05:30 IST