ఆ ‘కొత్త’ చెట్టుకు... ‘HOLLYWOOD HERO’ పేరు పెట్టేశారు! ఇంతకీ, అతనెవరంటే...

ABN , First Publish Date - 2022-01-09T18:16:40+05:30 IST

లండన్‌లోని కొందరు సైంటిస్టులు ‘కొత్త చెట్టుని’ కనుక్కున్నారు! తాము గుర్తించిన తాజా వృక్షానికి హాలీవుడ్ స్టార్ హీరో పెట్టారు. అయితే, అది కేవలం ఆయన సినిమాలు చూడటం వల్ల ఏర్పడిన అభిమానంతో కాదు. సిల్వర్ స్క్రీన్ హీరో... రియల్ హీరో అనిపించుకునేలా చేసిన ఓ మంచి పనికి గుర్తింపుగా వాళ్లు నామకరణం చేశారు!

ఆ ‘కొత్త’ చెట్టుకు... ‘HOLLYWOOD HERO’ పేరు పెట్టేశారు! ఇంతకీ, అతనెవరంటే...

లండన్‌లోని కొందరు సైంటిస్టులు ‘కొత్త చెట్టుని’ కనుక్కున్నారు! తాము గుర్తించిన తాజా వృక్షానికి హాలీవుడ్ స్టార్ హీరో పెట్టారు. అయితే, అది కేవలం ఆయన సినిమాలు చూడటం వల్ల ఏర్పడిన అభిమానంతో కాదు. సిల్వర్ స్క్రీన్ హీరో... రియల్ హీరో అనిపించుకునేలా చేసిన ఓ మంచి పనికి గుర్తింపుగా వాళ్లు నామకరణం చేశారు!

లండన్‌లోని ‘రాయల్ బొటానికల్ గార్డెన్స్’కు చెందిన శాస్త్రవేత్తలు కేవలం ఆఫ్రికాలోని క్యామరూన్ ట్రాపికల్ ఫారెస్ట్‌లో మాత్రమే కనిపించే ఓ అరుదైన వృక్షాన్ని గుర్తించారు. దానికి ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో పేరు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. వాళ్ల నిర్ణయానికి కారణం హాలీవుడ్ స్టార్ చేస్తోన్న పర్యావరణ హితమైన పనులేనట. ఇప్పుడు కొత్తగా కనుగొన్న చెట్టు ఎక్కడైతే పుట్టి, పెరుగుతుందో... ఆ ఆఫ్రికన్ అడవిని కూడా కొన్నాళ్ల క్రితం లియోనార్డో డికాప్రియో తన ఉద్యమంతో కాపాడాడు. ఎంతో జీవి వైవిధ్యం కలిగిన సదరు అటవీ ప్రాంతాన్ని ఆ మధ్య క్యామరూన్ దేశం కలప కోసం నరికివేయాలని సంకల్పించింది. వేలాది చెట్లు నేలకూలే ప్రమాదం ఏర్పడింది. తద్వారా ఎన్నో అరుదైన చెట్లు, జంతువులు అంతమయ్యే స్థితి నెలకొంది. అప్పుడు క్యామరూన్ అటవీ ప్రాంత నరికివేతల్ని డికాప్రియో తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టాడు. చివరకు, ఒత్తిడికి తలొగ్గిన క్యామరూన్ దేశపు ప్రభుత్వం క్యామరూన్ అటవీ ప్రాంతం జోలికి వెళ్లమని ప్రకటించింది. 

లక్షల చెట్లు, వేలాది జంతువుల్ని కాపాడిన హాలీవుడ్ స్టార్ లియోనార్డో పేరుని ఇప్పుడు కొత్తగా కనుగొన్న చెట్టుకి పెట్టారు. శాస్త్రవేత్తలు దానికి ఇచ్చిన అఫీషియల్ సైంటిఫిక్ నేమ్ ‘ఉవారియోప్సిస్ డికాప్రియో’! 

Updated Date - 2022-01-09T18:16:40+05:30 IST