Krishnamma : ఆసక్తికరంగా సెకండ్ పోస్టర్

ABN , First Publish Date - 2022-07-04T17:15:44+05:30 IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ (Satyadev) ఒకరు. విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలు అతడి ప్రధాన బలం. ఎలాంటి పాత్రకైనా తన స్టై్ల్లో జీవం పోయగల అద్భుత ప్రతిభ అతడి సొంతం. రొటీన్ కథాంశాల్ని దరిచేరనీయని ఈ హీరో..ఇటీవల ‘గాడ్సే’ (Godse) గా ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

Krishnamma : ఆసక్తికరంగా సెకండ్ పోస్టర్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ (Satyadev) ఒకరు. విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలు అతడి ప్రధాన బలం. ఎలాంటి పాత్రకైనా తన స్టై్ల్లో జీవం పోయగల అద్భుత ప్రతిభ అతడి సొంతం. రొటీన్ కథాంశాల్ని దరిచేరనీయని ఈ హీరో..ఇటీవల ‘గాడ్సే’ (Godse) గా ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం సత్యదేవ్.. తమన్నా (Tamanna) కథానాయికగా ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) అనే రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. లవ్ మాక్‌టైల్ (Love Mocktail) కన్నడ సినిమాకిది అఫీషియల్ రీమేక్. ఇదిలా ఉంటే. సత్యదేవ్ కొత్త సినిమాను నిన్న (జూలై 3) ప్రకటించారు. సినిమా పేరు ‘కృష్ణమ్మ’ (Krishnamma). నేడు (జూలై 4)  సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సత్యదేవ్ కోపంగా కత్తిపట్టుకొన్న లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


ఇక ఈ రోజు (జూలై 4) ‘కృష్ణమ్మ’ సినిమా నుంచి సెకండ్ లుక్‌ను కూడా విడుదల చేశారు. క్లోజప్‌లో గెడ్డంతో, మెళ్ళో రుద్రాక్ష మాలతో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు.. మంచి చెడుల కలయిక నది నడత.. పగ, ప్రేమ కలయిక మనిషి నడక.. అంటూ ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ ను చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తుంటే.. సత్యదేవ్ నటిస్తున్న తొలి యాక్షన్ డ్రామాగా అనిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి (Krishna kommalapati) నిర్మాణంలో వీవీ గోపాలకృష్ణ (VV Gopalakrishna) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కృష్ణానది నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ అందులేకపోతున్న సత్యదేవ్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడని మేకర్స్ నమ్మకంతో చెబుతున్నారు. ఈ సినిమా సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోందని పోస్టర్ ను బట్టి అర్ధమవుతోంది. ఇంతకు ముందెన్నడూ చేయని ఓ సరికొత్త పాత్రతో ముందుకు రాబోతున్న సత్యదేవ్ ఈ సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-07-04T17:15:44+05:30 IST