GodFather: సత్యదేవ్‌ని కొట్టడానికి సల్మాన్ ఖానా?

ABN , First Publish Date - 2022-09-13T01:14:37+05:30 IST

సత్యదేవ్‌ని కొట్టడానికి సల్మాన్ ఖానా?.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ డిస్కస్ చేస్తుంది ఇదే. మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) హీరోగా.. మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో

GodFather: సత్యదేవ్‌ని కొట్టడానికి సల్మాన్ ఖానా?

సత్యదేవ్‌ని కొట్టడానికి సల్మాన్ ఖానా?.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ డిస్కస్ చేస్తుంది ఇదే. మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) హీరోగా.. మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (GodFather). బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ చిత్రమైన ‘లూసిఫర్’ (Lucifer)కి రీమేక్. ఇందులో మెగాస్టార్‌కి సోదరిగా నయనతార (Nayanthara) నటిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ని ఇటీవలే విడుదల చేశారు. ఇందులో సత్యప్రియ జైదేవ్‌గా ఆమె కనిపించనుంది. తాజాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తున్న సత్యదేవ్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన ‘జైదేవ్’ (Jaidev) పాత్రలో నటిస్తున్నట్లుగా కూడా రివీల్ చేశారు. అంటే నయనతారకు భర్తగా ఇందులో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇప్పుడీ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో, సోషల్ మాధ్యమాలలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి.


ఈ పాత్రకి సంబంధించిన డీటైల్స్ వెల్లడించనంత వరకు.. చిరు, నయనతారలకు తమ్ముడుగా సత్యదేవ్ నటిస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘జైదేవ్’ అని పాత్ర పేరు రివీల్ చేయడంతో.. నయనతారకు భర్తగా అతను చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి మలయాళంలో ఆ పాత్రను బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చేశారు. అతన్ని రెండో పెళ్లి చేసుకునే పాత్రలో మంజు వారియర్ నటించింది. ఆ సినిమాలో మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్ పోటాపోటీగా నటించారు. కానీ నయనతారకు భర్తగా సత్యదేవ్ అంటేనే.. ఎక్కడో తేడా కొడుతుంది. ఇంకో విషయం ఏమిటంటే.. సత్యదేవే విలన్. ఆ పాత్రని కిల్ చేయడానికే సల్మాన్ ఖాన్ దిగుతాడు (ఒరిజినల్‌లో వివేక్ ఒబెరాయ్ కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ వస్తాడు). ఈ కాంబోని హైలెట్ చేస్తూ.. సత్యదేవ్ కోసం సల్మాన్ ఖానా? అనేలా సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు వచ్చిన ‘ఆచార్య’ సినిమాలో కూడా.. సత్యదేవ్ కనిపించే సీన్ చాలా సిల్లీగా ఉంటుంది. సినిమాకున్న మైనస్‌లలో అది కూడా ఒకటి. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేస్తున్నారా? అనే విధంగా కూడా కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. కాగా, విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



Updated Date - 2022-09-13T01:14:37+05:30 IST