Satya Dev: ‘గాడ్సే’ మే 20న రావట్లేదు

ABN , First Publish Date - 2022-05-19T03:01:04+05:30 IST

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న వెర్సటైల్ హీరో స‌త్యదేవ్ (Satya Dev). ఆయన హీరోగా టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’ (God-Se). గోపి గణేష్ పట్టాభి (Gopi Ganesh Pattabhi) దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి

Satya Dev: ‘గాడ్సే’ మే 20న రావట్లేదు

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న వెర్సటైల్ హీరో స‌త్యదేవ్ (Satya Dev). ఆయన హీరోగా టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’ (God-Se). గోపి గణేష్ పట్టాభి (Gopi Ganesh Pattabhi) దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్లఫ్ మాస్టర్‌’ (Bluff Master) వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న ‘గాడ్సే’ చిత్రంపై.. టైటిల్ ప్రకటన వచ్చినప్పటి నుండే మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే రిలీజ్ విషయంలో మాత్రం ఈ చిత్రం వాయిదా పడుతూనే వస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని జూన్ 17న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు మే 20న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.


సమాజంలో భాగమైన రాజకీయ వ్యవస్థ అవినీతిమయమైనప్పుడు అరాచకం పెరుగుతుంది. అలాంటి అవినీతి రాజకీయానికి కేరాఫ్ అయిన కొంత మంది నాయకుల‌ను ఓ యువ‌కుడు ప్రశ్నిస్తే  ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ‘గాడ్సే’ సినిమాను చూడాల్సిందేనంటున్నారు చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ (C Kalyan). అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్యవ‌స్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువ‌కుడి పాత్రలో స‌త్యదేవ్ క‌నిపించ‌నున్నారు. ఐశ్వర్య ల‌క్ష్మి (Aishwarya Lekshmi) ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. బ్రహ్మాజీ (Brahmaji), సిజ్జూ మీన‌న్ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్.. ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్‪ని సొంతం చేసుకుంది. జూన్ 17న గ్రాండ్ లెవ‌ల్లో సి.కె.స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేయ‌బోతున్నట్లు నిర్మాత సి.క‌ళ్యాణ్ తెలిపారు. కాగా, ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌టంతో పాటు.. క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను కూడా దర్శకుడు గోపి గ‌ణేషే అందిస్తున్నారు.



Updated Date - 2022-05-19T03:01:04+05:30 IST