Sathyaraj: పాత్ర నచ్చకపోయినా హీరో కోసం చేయాల్సి వచ్చింది..!

ABN , First Publish Date - 2022-06-07T17:01:08+05:30 IST

ఓ సినిమాలో తన పాత్ర నచ్చకపోయినా కూడా అందులో నటించిన హీరో అంటే తనకు అభిమానం..అందుకే నటించాల్సి వచ్చిందని బాహుబలి (Bahubali) కట్టప్ప (Kattappa) సత్యరాజ్ (Sathyaraj) తెలిపారు.

Sathyaraj: పాత్ర నచ్చకపోయినా హీరో కోసం చేయాల్సి వచ్చింది..!

ఓ సినిమాలో తన పాత్ర నచ్చకపోయినా కూడా అందులో నటించిన హీరో అంటే తనకు అభిమానం..అందుకే నటించాల్సి వచ్చిందని బాహుబలి (Bahubali) కట్టప్ప (Kattappa) సత్యరాజ్ (Sathyaraj) తెలిపారు. తమిళంలో ఆయనకి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ సత్యరాజ్ హీరోగా నటించిన సినిమాలు అనువాదాలుగా తెలుగులో విడుదలయ్యాయి. మధ్యలో కొన్ని తెలుగు సినిమాల్లోనూ ఆయన కనిపించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్యరాజ్ 'మిర్చి' (Mirchi) సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు. అప్పటి నుంచి వరుసగా ఇక్కడ సినిమాలు చేస్తూ వస్తున్నారు.


'బ్రహ్మోత్సవం',' హైపర్','జెర్సీ' .. ఇలా చాలా సినిమాలు చేశారు. అయితే, సత్యరాజ్‌కు ఈ సినిమాలన్నీ ఒకెత్తు.. 'బాహుబలి' సినిమాతో ఆయనకి వచ్చిన పాపులారిటీ ఒకెత్తు. బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియన్ సినిమాలకు సూటయ్యే నటుడిగా సౌత్‌లో పేరు తెచ్చుకున్నారు. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ - రానాల తరువాత సత్యరాజ్ పోషించిన 'కట్టప్ప' పాత్రకి మంచి పేరు వచ్చింది. అయితే, బాలీవుడ్ స్టార్ షారుక్ హీరో (Sharukh Khan)గా నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' (Chennai Express) సినిమాలో సత్యరాజ్ నటించారు.  


ఇందులో, ఆయన పోషించిన హీరోయిన్ తండ్రి పాత్ర తనకి ఎంతమాత్రం ఇష్టం లేదని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. 2013 ఆగస్టులో ఆ సినిమా ప్రేక్షకుల విడుదలైంది. దీపికా పడుకొన్ (Deepika Padukone) హీరోయిన్‌గా నటించింది. హిందీ సినిమా అయినప్పటికీ కథ చెన్నై నేపథ్యంలో సాగుతుంది. అందువల్ల నేటివిటీ కోసం చిత్ర బృందం సత్యరాజ్‌ను ఎంపిక చేసుకున్నారు. 


అయితే, తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి సత్యరాజ్ మాట్లాడూ. ''షారుక్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'లో నేను హీరోయిన్ తండ్రి పాత్రను పోషించాను. ఆ పాత్రను గురించి నాకు చెప్పినప్పుడు.. అంత గొప్పగా అనిపించలేదు. ఆ పాత్ర నాకు అంతగా నచ్చలేదని షారుక్ తోను.. దర్శకుడితోను చెప్పాను. కానీ, చివరికి చేయవలసి వచ్చింది. షారుక్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సినిమాలన్నిటినీ తప్పకుండా చూస్తుంటాను. ఆయన పట్ల ఉన్న అభిమానంతోనే.. ఈ సినిమా చేశాను" అని చెప్పారు. 

Updated Date - 2022-06-07T17:01:08+05:30 IST