Rajendra prasad: ఎమ్మెల్యే నారాయణ ఫస్ట్‌ లుక్‌!

ABN , First Publish Date - 2022-08-16T05:08:52+05:30 IST

రాజేంద్ర ప్రసాద్‌ నటించిన తాజా చిత్రం ‘శాసన సభ’. ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్‌ జంటగా నటించగా, సోనీ అగర్వాల్‌ పృథ్వీరాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు మడికంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

Rajendra prasad: ఎమ్మెల్యే నారాయణ ఫస్ట్‌ లుక్‌!

రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra prasad)నటించిన తాజా చిత్రం ‘శాసన సభ’(Sasanasabha). ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్‌ జంటగా నటించగా, సోనీ అగర్వాల్‌  పృథ్వీరాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు మడికంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తులసీరామ్‌ సాప్పని, రామ్‌ సాప్పని నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఎమ్మెల్యే నారాయణ స్వామిగా రాజేంద్ర ప్రసాద్‌ కనిపించనున్నారు. యూనివర్శల్‌ కథాంశంతో తెరకెక్కిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ఇది. విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా రాజేంద్రప్రసాద్‌ అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో చేయని పాత్ర ఇది’’ అని నిర్మాతలు అన్నారు. 


Updated Date - 2022-08-16T05:08:52+05:30 IST