Maheshbabu : పోకిరి – దూకుడు చిత్రాలను మించిపోతుందన్నారు

ABN , First Publish Date - 2022-05-17T04:43:21+05:30 IST

‘సర్కారు వారి పాట’ సినిమా చూసి మా అబ్బాయి గౌతమ్‌షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, కౌగిలించుకున్నారు. ‘అన్నింటికంటే ఈ సినిమాలోనే బాగా చేశావు నాన్న’ అని మా అమ్మాయి మెచ్చుకుంది. ‘పోకిరి’, ‘దూకుడు’ చిత్రాలను మించిపోతుందని’ మా నాన్న చెప్పారు. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడికే దక్కుతుంది. లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రేక్షకులు అందించిన ఈ సక్సెస్‌ ముందు అవన్నీ కనిపించట్లేదు’ అని మహేశ్‌బాబు అన్నారు.

Maheshbabu : పోకిరి – దూకుడు చిత్రాలను మించిపోతుందన్నారు

‘సర్కారు వారి పాట’(Sarkaruvaari paata)సినిమా చూసి మా అబ్బాయి గౌతమ్‌ (goutham)షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, కౌగిలించుకున్నారు. ‘అన్నింటికంటే  ఈ సినిమాలోనే బాగా చేశావు నాన్న’ అని మా అమ్మాయి మెచ్చుకుంది. ‘పోకిరి’, ‘దూకుడు’ చిత్రాలను మించిపోతుందని’ మా నాన్న చెప్పారు. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడికే దక్కుతుంది. లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రేక్షకులు అందించిన ఈ సక్సెస్‌ ముందు అవన్నీ కనిపించట్లేదు’ అని మహేశ్‌బాబు (Mahesh)అన్నారు. ఆయన నటించిన సర్కారువారి పాట చిత్రం సక్సెస్‌ వేడుక సోమవారం కర్నూల్‌లో జరిగింది. ఈ వేదికపై ‘మ..మ.. మహేశ్‌’ పాటకు స్టెప్పులేసి ఆహుతుల్ని అలరించారు. మహేశ్‌ మాట్లాడుతూ ‘‘ఒక్కడు’ షూటింగ్‌ సమయంలో కర్నూలు వచ్చా. మళ్లీ ఈ సినిమా సక్సెస్‌ కారణంగా రావడం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఈ వేడుక గురించి చెప్పగానే హ్యాపీ ఫీలయ్యా. ఈ జనాభిమానం చూస్తుంటే ఫంక్షన్‌ అంటూ జరిగితే రాయలసీమలోనే జరగాలి అన్నంతగా ఉంది. అందరూ హిట్‌ సినిమా కోసం కష్టపడి చేశారు. కీర్తిసురేశ్‌(Keerthi suresh), సముద్రఖని వల్ల సినిమాకు లుక్‌ వచ్చింది. తమన్‌ పాటలు సినిమాకు ఎసెట్‌. మైత్రీ సంస్థకి ‘శ్రీమంతుడు’ ఇచ్చానని కృతజ్ఞతగా ఉన్నారు. ఇప్పుడు నాకు ‘సర్కారు వారి పాట’ లాంటి ఘన విజయం ఇచ్చారు. నాన్నగారి ఫ్యాన్స్‌, నా అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు’ అని అన్నారు. 


‘‘ఈ సినిమా సక్సెస్‌ నాకు లైఫ్‌ టైమ్‌ గిఫ్ట్‌. మహేష్‌ బాబుగారికి థ్యాంక్స్‌ చెప్పడం చాలా చిన్న మాట. ఆయన్ని ఎంతగా ప్రేమిస్తానో మాటల్లో చెప్పలేను. మహేష్‌ గారికి మంచి సినిమా ఇస్తానని మాటిచ్చాను. ఆ మాట సర్కారు వారి పాటతో నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు పరశురామ్‌ (parasuram)అన్నారు.




Updated Date - 2022-05-17T04:43:21+05:30 IST