'సర్కారు వారి పాట': టైటిల్ సాంగ్ ట్యూన్‌తో థమన్ సర్‌ప్రైజ్

ABN , First Publish Date - 2022-01-23T16:30:15+05:30 IST

'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ ట్యూన్‌తో సర్‌ప్రైజ్ చేశారు చిత్ర సంగీత దర్శకుడు థమన్. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది

'సర్కారు వారి పాట': టైటిల్ సాంగ్ ట్యూన్‌తో థమన్ సర్‌ప్రైజ్

'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ ట్యూన్‌తో సర్‌ప్రైజ్ చేశారు చిత్ర సంగీత దర్శకుడు థమన్. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న 'సర్కారు వారి పాట' సమ్మర్‌కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో మహేశ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాదు, కనీసం ఇప్పటి వరకు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. 


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 'సర్కారు వారి పాట' మూవీ నుంచి అప్‌డేట్స్ ఇవ్వలేకపోతోన్నందుకు చిత్రబృందం క్షమాపణలు చెప్పింది. దాంతో మ్యూజికల్ ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయే.. అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను తాజాగా చిత్ర సంగీత దర్శకుడు థమన్ 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ ట్యూన్‌ను కొద్ది సేపు ప్లే చేసి సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు, త్వరలోనే మహేశ్ టైటిల్ సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ రాబోతుందనే విషయాన్ని థమన్ హింట్ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 



Updated Date - 2022-01-23T16:30:15+05:30 IST