‘సర్కారు వారి పాట’: టైటిల్‌ సాంగ్ రిలీజ్‌కు డేట్, టైమ్ ఫిక్స్

ABN , First Publish Date - 2022-04-21T04:04:58+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. సినిమాకి సంబంధించి విడుదలవుతోన్న

‘సర్కారు వారి పాట’: టైటిల్‌ సాంగ్ రిలీజ్‌కు డేట్, టైమ్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. సినిమాకి సంబంధించి విడుదలవుతోన్న ప్రతి ఒక్కటి.. ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. 3వ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన అప్‌డేట్‌ని తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది.


ఈ సినిమాలో మూడో పాట టైటిల్ సాంగ్‌ను ఈ నెల 23వ తేదీ ఉదయం 11గంటల 07 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ తెలియజేశారు. ఈ పాట ట్యూన్‌ని సినిమా టీజర్‌కి బీజీఎంగా కూడా ఉపయోగించారు. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్. థమన్ ఈ ఆల్బమ్ కోసం అద్భుతమైన సౌండ్‌ ట్రాక్‌లను కంపోజ్ చేసినట్లుగా.. ఇప్పటికే విడుదలైన పాటలు చూస్తుంటే తెలుస్తుంది. ఇక సినిమాకి సంబంధించి ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్లపై ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌లో షూట్ చేస్తున్న ఈ పాట మాస్ సాంగ్‌గా అలరించనుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మే 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Updated Date - 2022-04-21T04:04:58+05:30 IST