Parasuram: ‘నేను విన్నాను.. నేను వున్నాను’ డైలాగ్ అందుకే పెట్టాను

Twitter IconWatsapp IconFacebook Icon
Parasuram: నేను విన్నాను.. నేను వున్నాను డైలాగ్ అందుకే పెట్టాను

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), కీర్తి సురేష్(Keerthi Suresh) కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల‪పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‪టైనర్ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తోంది. చిత్ర ప్రమోషన్స్‪లో భాగంగా చిత్ర దర్శకుడు పరశురామ్.. మీడియాకు సర్కారు వారి పాట విశేషాలను తెలిపారు.


‘సర్కారు వారి పాట’ కథకి సంబంధించి ఐడియా ఎప్పుడొచ్చింది?

గీత గోవిందం (Geetha Govindam) ప్రొడక్షన్‪లో ఉన్నప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన లైన్ రాసుకోవడం జరిగింది. గీత గోవిందం విడుదలైన తర్వాత మహేష్ బాబు‪గారిని దృష్టిలో పెట్టుకొని పూర్తి కథపై వర్క్ చేయడం జరిగింది.


ఈ మధ్య కాలంలో మహేష్ బాబు డిఫరెంట్ జోనర్ చిత్రాలు చేస్తున్నారు. మీరు ఆయనని వేరే జోన్‪లోకి తీసుకొచ్చి పెట్టారు. క్యారెక్టర్ ఐడియాని ఎలా అనుకున్నారు?

ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి మెయిన్ రీజన్.. సర్కారు వారి పాట కథ ఎంత నచ్చిందో.. క్యారెక్టర్ డిజైన్ కూడా మహేష్ గారికి అంత నచ్చింది.


ట్రైలర్ చూస్తుంటే పూర్తి కమర్షియల్ సినిమా అనిపిస్తుంది?

అవును.. సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్. మహేష్ బాబు‪గారి లుక్స్, ప్రజంటేషన్ నెక్స్ట్ లెవల్‪లో ఉంటుంది. ‘గీత గోవిందం’ వంటి హిట్ వున్నా సరే ఒక మీడియం రేంజ్ దర్శకుడికి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాన్స్ ఎలా ఇచ్చారని కొందరిలో ఓ ప్రశ్న వుండొచ్చు.. కానీ సర్కారు వారి పాట చూసిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీలౌతారు.

Parasuram: నేను విన్నాను.. నేను వున్నాను డైలాగ్ అందుకే పెట్టాను

ట్రైలర్‪లో డైలాగులు భలే పేలాయి.. అప్పుని ఆడపిల్లతో పోల్చడం, విలన్ దీనికి పూర్తి భిన్నమైన మాట చెప్పడం గురించి?

అసలు కథ అదే. రెండు డిఫరెంట్ మైండ్ సెట్లు మధ్య జరిగే కథ.


ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ ఎంప్లాయా? విజయమాల్య (Vijay Mallya) కథకి లింక్ ఉంటుందా?

కాదు. ఇందులో బ్యాంక్ టాపిక్ ఉంటుంది కానీ బ్యాంకు ఉద్యోగి కాదు. అలాగే  ఈ కథలో ఒక వ్యక్తి గురించి కానీ, వ్యవస్థని ప్రశ్నించడం కానీ వుండదు. మంచి ఉద్దేశంతో రాసుకున్న కథ. సరదాగా ఉంటూ చెప్పాల్సింది బలంగా చెప్పే కథ.


మహేష్ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు.. అన్ని వర్గాల ప్రేక్షకుల గురించి ఆలోచిస్తారు? కానీ ఇందులో కొన్ని నాటు డైలాగులు కూడా చెప్పించారు?

మహేష్ బాబు‪గారికి సర్కారు వారి పాటలో క్యారెక్టర్ చాలా నచ్చింది. కథలో క్యారెక్టర్ బిహేవియర్ అలా వుంటుంది. 


లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది?

అద్భుతంగా ఉంటుంది. లవ్లీ, లైవ్లీగా ఉంటుంది. కీర్తి సురేష్‪ది ఇందులో బలమైన పాత్ర. కథలో చాలా కీలకం.


కీర్తి సురేష్ ఇప్పుడు నటనకు ప్రాధాన్యం వుండే పాత్రలు చేస్తున్నారు కదా.. ఈ సినిమాకి ఆమెను తీసుకోవడానికి గల కారణం? 

లాక్ డౌన్‪కి ముందే ఈ కథ ఫైనల్ అయింది. అప్పుడు  హీరోయిన్ పాత్రకి  కీర్తి సురేష్ తప్ప మరో ఆలోచన రాలేదు. సినిమా చూసిన తర్వాత హీరోయిన్‪గా కీర్తిని ఎందుకు తీసుకున్నామో అందరికీ అర్ధమౌతుంది. తన లుక్స్ అద్భుతంగా వుంటాయి. మహేష్ బాబు‪గారిని చాలా కొత్తగా అద్భుతంగా చూపించారని ట్రైలర్ చూసి ఎలా మాట్లాడుకుంటున్నారో.. సినిమా చూసిన తర్వాత కీర్తి సురేష్ పాత్రకు కూడా అంత మంచి పేరొస్తుంది.

Parasuram: నేను విన్నాను.. నేను వున్నాను డైలాగ్ అందుకే పెట్టాను

సముద్రఖని(Samuthirakani) పాత్ర గురించి..?

సముద్రఖనిగారి పాత్ర ఫెంటాస్టిక్‪గా వుంటుంది. అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాకి ఆయన పాత్ర ఒక అసెట్‪గా ఉండబోతుంది.


పాత్రలు కూడా యునిక్‪గా చూపించినట్లు ఉన్నారు? ఏదైనా ప్యాట్రన్ ఫాలో అయ్యారా?

ఒక ప్యాట్రన్ ఫాలో అవ్వడం ఉండదు. నా గత సినిమాలు చూసుకున్న అవసరమైన చోటే పాట వుంటుంది. ట్యూన్, సాహిత్యం పై కూడా చాలా పర్టిక్యులర్‪గా ఉంటాను. సర్కారు వారి పాటలో సాంగ్స్ కి అద్భుతమైన సందర్భాలు కుదిరాయి. అవసరమైన చోటే పాట వస్తుంది. పాటలన్నీ అద్భుతంగా ఉండబోతున్నాయి.


‘గీత గోవిందం’ వంటి చార్ట్‪బస్టర్ ఆల్బమ్‪ని ఇచ్చిన సంగీత దర్శకుడు గోపిసుందర్‪ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది?

పక్కన పెట్టడం కాదండీ. సర్కారు వారి పాటకి వర్క్ చేయాలనుకున్నప్పుడు గోపి సుందర్ (Gopi Sunder) చాలా బిజీగా వున్నారు. దాదాపు ఎనిమిది ప్రాజెక్ట్‪లు అతని చేతిలో వున్నాయి. సమయం కుదరక చేయలేదు కానీ పక్కన పెట్టడం మాత్రం కాదు. నా మనసులో గోపి సుందర్‪కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం వుంటుంది.


మహేష్ బాబు ఈ మధ్య కాలంలో తన సినిమాల్లో ఒక సందేశం ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో అలాంటి మెసేజ్ ఏమైనా వుంటుందా?

మెసేజ్ వుండదు కానీ పర్పస్ ఉంటుంది. సినిమా మొత్తం లైటర్ వెయిన్‪లో వినోదాత్మకంగా వెళుతూ చివర్లో ఓ అద్భుతమైన పర్పస్ నెరవేరుతుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈ పాయింట్‪కి కనెక్ట్ అయ్యేలా వుంటుంది.


సర్కారు వారి పాట కథ మొదట అల్లు అర్జున్ (Allu Arjun) గారికి చెప్పారా?

లేదండీ. ఇది మహేష్ బాబు గారి కోసం పుట్టిన కథ. దేవుడి దయ వల్ల ఆయనే చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఈ సినిమాతో ఆ డ్రీమ్ తీరింది.


‘గీత గోవిందం’ విజయం దర్శకుడిగా మీకు ఎలాంటి మలుపుని ఇచ్చింది?

గీత గోవిందం గొప్ప ఎనర్జీ నింపింది.  పరశురామ్ అనే దర్శకుడు రూ.150 కోట్ల సినిమా తీయగలడనే నమ్మకాన్ని ఇచ్చింది. 


లాక్ డౌన్‪తో చాలా గ్యాప్ వచ్చింది కదా.. ఈ గ్యాప్‪లో సర్కారు వారి పాట కథలో మార్పులు ఏమైనా చేశారా?

లేదు. నేను కథ చెప్పిన తర్వాత ఆ కంటెంట్ నచ్చే మహేష్ బాబుగారు ఓకే చేశారు. ఒకవేళ మార్పులు చేయాల్సిన అవసరమే వుంటే.. అసలు అంత దూరం రాదు కదా.


మహేష్ బాబు డ్యాన్స్‪లు ఎలా వుండబోతున్నాయి?

మహేష్ బాబుగారి డ్యాన్సులు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తాయి. డ్యాన్సులు ఇరగదీశారు.


సర్కారు వారి పాటని పోకిరి (Pokiri)తో పోల్చుతున్నారు?

పోకిరి ఒక అండర్ కాప్ బిహేవియర్. సర్కారు వారి పాట ఒక కామన్ మాన్ బిహేవియర్. ఇందులో ఇంకాస్త ఓపెన్ అవుతారు. మ్యానరిజమ్స్, లుక్స్ , బాడీ లాంగ్వెజ్.. చూసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతారు.


‘నేను విన్నాను.. నేను వున్నాను’ డైలాగ్ పెట్టారు.. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ప్రేరణా?

నాకు రాజశేఖర్ రెడ్డిగారంటే అభిమానం. ఆయన్ని చూస్తే ఒక హీరో ఫీలింగ్. చాలా గొప్ప మాటని సింపుల్‪గా చెప్పేశారు. సర్కారు వారి పాటలో కూడా అలాంటి ఒక సందర్భం వచ్చింది. మహేష్ గారు ఆ డైలాగు చెప్పారు. నేను కథ చెప్పినపుడే ఈ డైలాగ్ గురించి చెప్పాను. మహేష్ గారు చాలా ఎంజాయ్ చేశారు. ఆ సీన్ వరకు వచ్చి వెళ్ళిపోయే డైలాగ్ అది. ఆ సీన్ అద్భుతంగా వుంటుంది.


డైలాగులు బాగా రాస్తారు కదా.. దీనికి ప్రేరణ?

మా గురువుగారు పూరి జగన్నాధ్ (Puri Jagannadh)‪గారు, త్రివిక్రమ్(Trivikram)‪గారి సినిమాలన్నీ చూస్తా.


మహేష్ బాబుతో పూరి  రెండు సినిమాలు చేశారు. మీకు ఏమైనా ఇన్‪పుట్స్ ఇచ్చారా?

మహేష్ గారితో సినిమా చేస్తున్నానని చెప్పాను. ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్ చూసి ఫోన్ చేశారు. ‘థిస్ ఈజ్ మహేష్ రిపోర్టింగ్ ఫ్రం చేపలపుడ బీచ్ సర్’ డైలాగ్ పూరి గారికి బాగా నచ్చింది.


సెన్సార్ పుర్తయిందా?

అయ్యింది. కట్స్ ఏమీ లేవు. లెంత్ పర్ఫెక్ట్ గా వుంది. పూరి స్కూల్ నుంచి వచ్చినవారికి లెంత్ సమస్య వుండదు.


తమన్ (Thaman) గారితో పని చేయడం ఎలా అనిపించింది?

తమన్ గారు చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. సౌండ్స్, ట్యూన్స్ కొత్తగా డిజైన్ చేశారు. కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్, మాస్ పాట అన్నీ స్క్రిప్ట్ లో వున్నవే. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. సర్కారు వారి పాట కోసం తమన్ యునిక్ స్టయిల్‪లో వర్క్ చేశారు.


మహేష్ బాబుగారి డాటర్ సితార(Sithara) సినిమాలో ఉంటారా?

లేదండీ. ప్రమోషనల్ సాంగ్ కోసం చేశాం. ఇది తమన్ ఐడియా. మహేష్ బాబుగారిని అడిగితే ఓకే అన్నారు.


ఈ మధ్య అన్నీ పాన్ ఇండియా సినిమాలుగా సిద్ధమౌతున్నాయి. లాక్ డౌన్‪లో మీకు సమయం దొరికింది. మరి సర్కారు వారి పాటకు పాన్ ఇండియా ఆలోచన చేయలేదా?

లేదండీ. మహేష్ గారికి గానీ, నాకు గానీ ఆ ఆలోచన లేదు. ముందు ఏ లక్ష్యంతో  మొదలుపెట్టామో.. దాన్ని అందుకోవడానికి కష్టపడాలనుకున్నాం. అన్ని చోట్లకి తెలుగు వెర్షన్ వెళ్తుంది. 


తర్వాత ఏ సినిమా చేస్తున్నారు?

నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా 14రీల్స్ (14 reels) నిర్మాణంలో సినిమా ఉండబోతుంది.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.