Sarkaru Vaari Paata: 'బ్లాస్ట్ కన్‌ఫర్మ్'..మహేశ్ పోస్ట్ వైరల్

ABN , First Publish Date - 2022-05-10T18:56:58+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన మాస్ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని మే 12న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Sarkaru Vaari Paata: 'బ్లాస్ట్ కన్‌ఫర్మ్'..మహేశ్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu), కీర్తి సురేశ్ (Keerthi Suresh) జంటగా నటించిన మాస్ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని మే 12న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు పరశురామ్ పెట్లా ( Parasuram Petla) దర్శకత్వం వహించగా, మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ (S S Thaman) సంగీతం అందించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను నాన్‌స్టాప్‌గా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో మహేశ్ తాజాగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను పెట్టారు. 


ఇందులో ఆయన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాం..


హాయ్ దిస్ ఈజ్ మహేశ్ బాబు ..వాట్స్ హ్యాపెనింగ్ అంటూ అభిమానులను పలకరించారు..


హ్యాష్‌ట్యాగ్‌లో మిమ్మల్ని మీరు వివరించండి..? 

కామ్ అండ్  ఫోకస్డ్.. 

ఇప్పటి వరకు మీకు వచ్చిన అత్యంత ఫన్నీ డైరెక్ట్ మెసేజ్ ఏమిటి..? 

ఐ థింక్ మై డిఎం ఈజ్ లాక్డ్..షుడ్ ఐ ఓపెన్ ఇట్.. 

ఎమోజీలో మీ గురించి వివరించండి..!  

స్మైలీ (చిరు నవ్వుతో) 

మీరు ట్విట్టర్‌లో ఫాలో అవ్వాలనుకుంటే ఎవరిని ఫాలో అవుతారు..? 

నా భార్య ట్విట్టర్‌లో ఉంటే బావుండేది...

ట్విట్టర్‌లో ఎడిట్ బటన్ ఉపయోగిస్తారా లేదా..? 

ఎ బిగ్ ఎస్..

'ఒక్కడు' సినిమాలో ఏ పాత్రను ఫాలో అవుతారు..ఏది మ్యూట్ చేస్తారు..ఏది బ్లాక్ చేస్తారు..? 

స్వప్న రోల్‌ను ఫాలో అవుతాను..నా తండ్రి పాత్రలో నటించిన ముఖేష్ రుషి పాత్రను మ్యూట్ చేస్తా..ప్రకాష్ రాజ్ పోషించిన ఓబుల్ రెడ్డి రోల్‌ను బ్లాక్ చేస్తాను.   

జీఐఎఫ్, జేఐఎఫ్ లలో ఏదీ..? 

జేఐఎఫ్.. 

ట్వీట్‌లో సర్కారు వారి పాటను వివరించండి..?

ఈ సమ్మర్‌లో నా ఫ్యాన్స్‌కు సర్కారు వారి పాట బ్లాస్ట్.. (భారీ హిట్ గ్యారెంటీ అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు మహేశ్). 

ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ సూపర్ స్టార్ సమాధానాలు చెప్పి అభిమానులను థ్రిల్ చేశారు. 




Updated Date - 2022-05-10T18:56:58+05:30 IST