ప్రేమికుల రోజున ‘సర్కారు వారి పాట’ స్పెషల్ ఇదే!

ABN , First Publish Date - 2022-02-08T01:59:09+05:30 IST

ప్రేమికుల రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్

ప్రేమికుల రోజున ‘సర్కారు వారి పాట’ స్పెషల్ ఇదే!

ప్రేమికుల రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ చిత్ర మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించారు.


సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని, తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడతారని చిత్రయూనిట్ పేర్కొంటోంది.



Updated Date - 2022-02-08T01:59:09+05:30 IST