Godfather : ఆడియో రైట్స్ వారికే !

ABN , First Publish Date - 2022-07-03T20:47:56+05:30 IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘గాడ్‌ఫాదర్’ (Godfather) ఒకటి. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) కిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

Godfather : ఆడియో రైట్స్ వారికే !

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘గాడ్‌ఫాదర్’ (Godfather) ఒకటి. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) కిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohanraja) దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా తెలుగు నేటివిటీతో తెరకెక్కిస్తున్నారు.


పొలిటికల్ కింగ్ మేకర్‌గా చిరంజీవి పవర్ ఫుల్ పాత్రను చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. చిరు, సల్లూభాయ్‌లపై ప్రత్యేకగీతం అభిమానుల్ని అలరించబోతోంది. ఈ  సినిమాను ఆగస్ట్ లో కానీ సెప్టెంబర్ లో కానీ విడుదల చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 


ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో సంస్థ ‘సారేగామా సౌత్’ కైవసం చేసుకుంది. అంటే ఈ సినిమా నుంచి అన్ని లిరికల్ సాంగ్స్ వీరినుంచే వస్తాయన్నమాట. ఇందులో చిరంజీవికి హీరోయిన్ లేకపోవడం గమనార్హం. గత చిత్రం ‘ఆచార్య’ లో చిరంజీవికి హీరోయిన్ లేని సంగతి తెలిసిందే. ‘గాడ్‌ఫాదర్’ విషయంలోనూ చిరు అదే ఫాలో అవుతుండడం అభిమానుల్ని నిరాశపరుస్తోంది. అయితే ఇందులో ఓ ఐటెమ్ సాంగ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అది ప్రీక్లైమాక్స్ లో వస్తుంది. ఇందులో చిరంజీవి నర్తిస్తారో లేదో ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ సినిమాలోని పాటలు ఏ స్థాయిలో అభిమానుల్ని మెప్పిస్తాయో చూడాలి. 



Updated Date - 2022-07-03T20:47:56+05:30 IST