‘కళావతి’ ముందే వచ్చేస్తోంది

ABN , First Publish Date - 2022-02-13T19:05:15+05:30 IST

ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు పురస్కరించుకుని ‘సర్కారు వారి పాట’ టీమ్ విడుదల చేయాలనుకున్న ‘కళావతి’ సాంగ్ ముందే లీకవ్వడంతో.. ఒరిజినల్ లిరికల్ సాంగ్‌ను ముందే విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు

‘కళావతి’ ముందే వచ్చేస్తోంది

ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు పురస్కరించుకుని ‘సర్కారు వారి పాట’ టీమ్ విడుదల చేయాలనుకున్న ‘కళావతి’ సాంగ్ ముందే లీకవ్వడంతో.. ఒరిజినల్ లిరికల్ సాంగ్‌ను ముందే విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయబోతోన్నట్టు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. 


చిత్ర ప్రొమోషన్స్‌లో భాగంగా ప్రేమికుల రోజున ‘కళావతి’ సింగిల్‌ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు. అయితే యూనిట్‌లోని కొందరు ఈ పాటని ముందే లీక్ చేయడంతో, దర్శకనిర్మాతలే కాకుండా సంగీత దర్శకుడు థమన్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పాటని ముందే అంటే.. ఫిబ్రవరి 13 సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు.



Updated Date - 2022-02-13T19:05:15+05:30 IST