తన తల్లిదండ్రుల విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన Sara Ali Khan

ABN , First Publish Date - 2021-11-06T01:27:18+05:30 IST

బాలీవుడ్‌లో సెలెబ్రిటీల విడాకులు అనేవి చాలా మాములుగా మారిపోయాయి. విడాకుల అనంతరం వారు వేర్వేరు దారులు చూసుకుంటున్నారు.

తన తల్లిదండ్రుల విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన Sara Ali Khan

బాలీవుడ్‌లో సెలెబ్రిటీల విడాకులు అనేవి చాలా మాములుగా మారిపోయాయి. విడాకుల అనంతరం వారు వేర్వేరు దారులు చూసుకుంటున్నారు. దాంపత్య బంధం ముక్కలయ్యాక పిల్లలతో సహా వారు కూడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి విషయాన్నే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సారా అలీఖాన్ తాజాగా మీడియాతో పంచుకుంది. తమ తల్లిదండ్రుల విడాకులపై తన అభిప్రాయన్ని మీడియాకు చెప్పింది.


సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్‌లు 1991లో పెళ్లి చేసుకున్నారు. 2004లో తమ దాంపత్య జీవితానికి వీడ్కొలు పలికారు. విడాకుల అనంతరం సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్‌లను పెంచే బాధ్యత అమృతా సింగ్‌కు దక్కింది. ఇద్దరూ విడిపోయినప్పటికీ సైఫ్‌ తన పిల్లల నుంచి  ఎప్పుడు కూడా దూరం కాలేదు. ఇప్పటికీ కూడా వారు తమ తండ్రితో  విలువైన సమయాన్ని గడుపుతుంటారు. 


తమ అమ్మ, నాన్నలు విడిపోవడం అనేది మంచి నిర్ణయమేనని సారా అలీఖాన్ ఇప్పటికీ భావిస్తుంటుంది.  ‘‘ దంపతులుగా విడిపోవడం అనేది చాలా సులభం. అందరికీ రెండు ఛాయిస్‌లు ఉంటాయి. ఒకే ఇంట్లో ఉంటూ సంతోషం లేకుండా జీవించడం. విడాకులు తీసుకుని ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని ఆస్వాదిస్తూ తమకు నచ్చినట్టు బతకడం ’’ అని సారా అలీఖాన్ మీడియాతో చెప్పింది.


‘‘ నేను నా తల్లితో కలిసి నివసించాను. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. ఏ విషయాన్నైనా ఆమెతో పంచుకోవచ్చు. విడాకులు తీసుకున్న 10ఏళ్ల అనంతరం కూడా నా తల్లి నవ్వడం మానేసింది. ఇద్దరూ కలిసి సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడపలేదు. నా చిన్నతనంలోనే ఆ విషయం నాకు అర్థమైంది. అందువల్లే వారు విడిపోయాక కూడా నేను ఆనందంగా ఉన్నాను. నాకు అందుబాటులో ఒక ఫోన్ కాల్ దూరంలో నా తండ్రి ఉన్నాడు. నేను ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు ఆయనను కలవవచ్చు. విడాకులకు ముందు వారు సంతోషంగా ఉన్నారని నేను అనుకోవట్లేదు ’’  అని ఆమె వివరించింది. సారా అలీఖాన్ ఈ మధ్యనే కూలీ నెం-1 చిత్రంలో నటించింది.  ‘‘ అత్రంగీరే ’’ అనే చిత్రంలో ఆమె కనిపించనుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ధనుష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.   


Updated Date - 2021-11-06T01:27:18+05:30 IST