నేను అమ్మలా.. తమ్ముడు నాన్నలా.. కానీ ఒకటే తేడా అంటున్న Sara Ali Khan

ABN , First Publish Date - 2022-04-07T15:33:56+05:30 IST

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, నటి అమృతాసింగ్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న

నేను అమ్మలా.. తమ్ముడు నాన్నలా.. కానీ ఒకటే తేడా అంటున్న Sara Ali Khan

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, నటి అమృతాసింగ్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న నటి సారా అలీఖాన్. ‘కేదార్‌నాథ్’ సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ భామ అనంతరం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అందంతోపాటు అభినయంతోనూ యూత్ గుండెలను కొల్లగొట్టింది. సారాకి ఓ ఇబ్రహిం అలీఖాన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. ఈ భామ 1995లో పుట్టగా.. ఆరేళ్ల తర్వాత అంటే 2001లో ఇబ్రహిం పుట్టాడు. అయితే.. సారా అచ్చుగుద్దినట్లు తన తల్లిలాగా.. ఇబ్రహిం తన తండ్రిలాగా ఉంటారు. దీంతో వారి పోలికలపై కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సారా స్పందించింది.


సారా మాట్లాడుతూ.. ‘నేను అమ్మాలా.. ఇబ్రహిం నాన్నలా కనిపించడం నార్మల్ కాదు. మేము ఒకేలా ఉన్నాం. అంటే మేమిద్దరం అమ్మనాన్నలకి డూపుల్లా కాదు. కానీ అచ్చుగుద్దినట్లు వారిలా కనిపించడం వల్లే అందరూ ఇలా మాట్లాడుతున్నారేమో.


ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇబ్రహీం చాలా ప్రశాంతంగా, కామ్‌గా ఉంటాడు. చూడటానికి తను నాన్నలా ఉన్నప్పటికీ.. ప్రవర్తన మాత్రం అమ్మలా ఉంటుంది. నేను కూడా అంతే.. చూడటానికి అమ్మలా ఉన్నప్పటికీ.. ప్రవర్తించడం, యాక్టివ్‌నెస్ మాత్రం నాన్నలా ఉంటుంది. అందుకే మా కుంటుంబంలో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు.. మా వ్యక్తిత్వాలు, ముఖాలు మారడం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-04-07T15:33:56+05:30 IST