Hrithik Roshan ఇంటి పక్కనే ఖరీదైన ఫ్లాట్ కొన్న దంగల్ భామ!

ABN , First Publish Date - 2021-11-04T17:11:04+05:30 IST

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ `దంగల్` సినిమాలో బబిత పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది సన్యా మల్హోత్రా

Hrithik Roshan ఇంటి పక్కనే ఖరీదైన ఫ్లాట్ కొన్న దంగల్ భామ!

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ `దంగల్` సినిమాలో బబిత పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది సన్యా మల్హోత్రా. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఈ భామ ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన ఫ్లాట్‌ను దక్కించుకుంది. ముంబైలోని జుహు-వెర్సోవా లింక్ రోడ్డులోని సముద్రానికి అభిముఖంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో సన్యా ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ ఖరీదు 14.3 కోట్ల రూపాయలట. 


ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు సన్యా ఏకంగా 72 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించిందట. ఈ బిల్డింగ్‌లోనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల రెండు విలాసవంతమైన ఫ్లాట్‌లను కొనుగోలు చేశాడు. 38000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆ ఫ్లాట్‌ల కోసం హృతిక్ ఏకంగా రూ.100 కోట్లు చెల్లించాడు. ఓపెన్ టెర్రస్, 10 పార్కింగ్ స్లాట్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్‌ కలిగిన ఆ ఫ్లాట్‌లను హృతిక్ తన కొడుకుల కోసం కొనుగోలు చేశాడు. ఆ బిల్డింగ్‌లోనే తాజాగా సన్యా కూడా ఓ ఫ్లాట్ దక్కించుకుంది. 

Updated Date - 2021-11-04T17:11:04+05:30 IST