కెరీర్‌ కోసం సంచితా శెట్టి ఫొటోషూట్‌

ABN , First Publish Date - 2021-09-19T23:08:06+05:30 IST

హీరో విజయ్‌ సేతుపతి నటించిన ‘సూదు కవ్వుం’ అనే చిత్రం ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్‌ సంచితా శెట్టి.

కెరీర్‌ కోసం సంచితా శెట్టి ఫొటోషూట్‌

హీరో విజయ్‌ సేతుపతి నటించిన ‘సూదు కవ్వుం’ అనే చిత్రం ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న కన్నడ హీరోయిన్‌ సంచితా శెట్టి. ఆ తర్వాత ఆమె ‘ఎన్నోడ విలైయాడు’, ‘రమ్‌’, ‘ఎంగిట్ట మోదాదే’ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఈమె ‘పార్టీ’, ‘పల్లు పడామ పాత్తుకో’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ... అవి ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఫలితంగా ఆమె క్రేజ్‌తో పాటు మార్కెట్‌ కూడా కాస్త మందగించింది. 


ఇదే పరిస్థితి కొనసాగితే తన కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారుతుందని భావించిన సంచితా శెట్టి.. సోషల్‌ మీడియానే నమ్ముకుంది. ఇందుకోసం పూర్తిస్థాయిలో ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ ప్రత్యేక ఫొటోషూట్‌లను నిర్వహిస్తూ ఆ ఫొటోలను తన సామాజిక ఖాతాల్లో పోస్టు చేస్తోంది. ఈ క్రమంలో ఈమె తాజాగా తీసిన ఫొటోషూట్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.  

Updated Date - 2021-09-19T23:08:06+05:30 IST