Sana Khan: సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పడం వెనుక అసలు కారణాన్ని వెల్లడించిన సనాఖాన్

ABN , First Publish Date - 2022-07-26T22:02:07+05:30 IST

‘మిస్టర్ నూకయ్య’, ‘కల్యాణ్‌రామ్ కత్తి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి సనాఖాన్...

Sana Khan: సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పడం వెనుక అసలు కారణాన్ని వెల్లడించిన సనాఖాన్

‘మిస్టర్ నూకయ్య’, ‘కల్యాణ్‌రామ్ కత్తి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి సనాఖాన్ (Sana Khan). అంతేకాకుండా.. ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ భామకి మంచి పాపులారిటీ ఉంది. అలాగే.. బాలీవుడ్‌(Bollywood) లోకి అడుగుపెట్టి అక్కడ సైతం మంచి గుర్తింపునే సాధించింది. వరుసగా సినిమాలు, టీవీ షోలలో నటిస్తూ కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్నప్పటికీ సనా సడెన్‌గా 2020లో వినోదరంగానికి దూరమైపోయింది. 2020లో ముఫ్తీ అనాస్‌ను వివాహం చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోయింది. ఈ మాజీ నటి తాజాగా ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ.. ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పడం వెనుక అసలు కారణాన్ని వెల్లడించింది.


సనా మాట్లాడుతూ.. ‘నా గత జీవితంలో.. నాకు పేరు, కీర్తి, డబ్బు అన్నీ ఉన్నాయి. నేను చేయాలనుకున్నా ప్రతిదాన్ని చేయగలను. కానీ నా హృదయంలో ప్రశాంతత లేదు. నాకు అన్నీ ఉన్నప్పటికీ నేను ఎందుకు సంతోషంగా లేను? అనే విషయం అర్థం కాలేదు. ఆ పరిస్థితి చాలా కఠినమైనది. చాలా రోజులు నిరాశలో ఉన్నాను. కొన్ని సంకేతాల ద్వారా దేవుడి సందేశాలను చూడగలిగాను.


నాకు ఇంకా గుర్తుంది. 2019లో రంజాన్ సమయంలో.. నేను కలలో ఒక సమాధిని చూశాను. అది మండుతోంది. ఆ సమాధిలో నాకు నేనే కనిపించాను. నేను మారకపోతే నా అంతం ఇదే అని దేవుడు నాకు ఇస్తున్న సంకేతంగా నేను భావించాను. అది నాకు కొంచెం ఆందోళన కలిగించింది. జరుగుతున్న మార్పులు నాకు ఇంకా గుర్తున్నాయి. నేను పలు ఇస్లామిక్ ప్రసంగాలను విని ప్రేరణ పొందాను. ఒక రాత్రి నాకు ఓ అందమైన విషయం అర్థమైంది. ఈ జన్మ డబ్బు, కీర్తి సంపాదించడానికి మాత్రమే కాదు. నిస్సహాయులకి సహాయం చేయడమే జీవిత పరమార్థమని అర్థం చేసుకున్నా’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-07-26T22:02:07+05:30 IST