Rajappa: నితిన్‌కు విలన్‌గా సముద్రఖని.. లుక్ అదిరింది

ABN , First Publish Date - 2022-07-14T23:39:31+05:30 IST

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ (Nithiin) నటిస్తోన్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం

Rajappa: నితిన్‌కు విలన్‌గా సముద్రఖని.. లుక్ అదిరింది

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ (Nithiin) నటిస్తోన్న  పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ప్రత్యేక గీతానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ‘రా రా రెడ్డి’ అంటూ వచ్చిన ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవడమే కాకుండా.. ఇటీవలి కాలంలో బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ పాటలో నితిన్, అంజలిల మాస్ డ్యాన్స్‌లు అందరినీ అలరిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలోని విలన్‌ని చిత్రయూనిట్ పరిచయం చేసింది.


‘మాచర్ల నియోజకవర్గం’ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే రాజప్ప (Rajappa) పాత్రలో కనిపించబోతున్నారు విలక్షణ నటుడు సముద్రఖని (Samuthirakani). మాచర్ల నియోజకవర్గంలో రాజప్పకు ప్రతిపక్షమే లేదు. నెరిసిన జుట్టు, మెలితిరిగిన మీసం, నుదిటిన తిలకం, మెడలో రుద్రాక్షమాలతో వింటేజ్ పొలిటిషియన్ లుక్‌లో కనిపించిన సముద్రఖని పేపర్‌లపై సంతకం చేస్తూ సీరియస్‌‌గా చూస్తున్న లుక్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్బ్ స్పందన వస్తోంది. ఐఏఎస్ అధికారి నితిన్, ఎమ్మెల్యే రాజప్పల మధ్య పోరు ఇందులో ఆసక్తికరంగా వుండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో.. శ్రేష్ట్ మూవీస్ (Sreshth Movies) బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.



Updated Date - 2022-07-14T23:39:31+05:30 IST