Samudrakani: పవన్ కళ్యాణ్‌ను అభిమానిగా డైరెక్ట్ చేస్తా..

ABN , First Publish Date - 2022-05-13T17:04:19+05:30 IST

పవన్ కళ్యాణ్‌ను ఓ అభిమానిగా డైరెక్ట్ చేస్తా..అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు దర్శక, నటుడు సముద్రఖని. దర్శకుడిగా తమిళంలో చిత్రాలను తెరకెక్కించిన ఆయన నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గాయకుడిగా

Samudrakani: పవన్ కళ్యాణ్‌ను అభిమానిగా డైరెక్ట్ చేస్తా..

పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ను ఓ అభిమానిగా డైరెక్ట్ చేస్తా..అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు దర్శక, నటుడు సముద్రఖని (Samudrakani). దర్శకుడిగా తమిళంలో చిత్రాలను తెరకెక్కించిన ఆయన నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గాయకుడిగా కూడా మంచి పాపులారిటీని సాధించారు. నటుడిగా తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో మంచి పాత్రలను చేస్తూ బిజీగా ఉన్నారు. అయినా కూడా అప్పుడప్పుడు దర్శకత్వం కూడా చేస్తున్నారు. అలా సముద్రఖని తెరకెక్కించిన సినిమా వినోదాయ సితం (Vinodhaya Sitham). ఇటీవల జీ5 ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.


ఈ మూవీలో సముద్రఖని (SamuthiraKani), తంబి రామయ్య (Tambi Ramayya) కీలక పాత్రలను పొషించారు. ఈ వినోదాయ సితం సినిమా పవన్ కళ్యాణ్‌కు నచ్చడంతో తెలుగులో రీమేక్ చేయాలని డిసైడయ్యారు. త్రివిక్రం శ్రీనివాస్ Trivikram Srinivas) తెలుగులో స్క్రిప్ట్ అందిస్తున్నారు. అయితే, ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని ఇప్పుడు తెలుగు రీమెక్ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సముద్రఖని ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోదాయ సితం చిత్రం తెలుగు రీమేక్ గురించి చెప్పుకొచ్చారు. 'నేను పవన్‌కు పెద్ద అభిమానిని..ఒకవైపు అభిమానిగా ఉంటూనే మరోవైపు ఆయనను డైరెక్ట్ చేస్తాను'..అని అన్నారు. దాంతో ఇన్నాళ్ళు కాస్త కన్‌ఫ్యూజన్‌లో ఉన్న అభిమానులకు ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చినట్టైంది. అంతేకాదు, సముద్రఖని చెప్పినదాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్టు అర్థమవుతోంది. కాగా, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇందులో హీరోగా నటించనున్నట్టు ముందునుంచి టాక్ వినిపిస్తోంది. త్వరలో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అప్పుడు ఇందులో నటించేదెవరో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. 

Updated Date - 2022-05-13T17:04:19+05:30 IST