యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), చాందిని చౌదరి (Chandini Chowdari) జంటగా నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’ (Sammathame). జూన్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గోపినాథ్ (Gopinath) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగాసాగుతున్నాయి. లఘు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం.. సినిమాలలో హీరోగా అవకాశాలు అందుకున్నాడు. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పటికే ఈ యంగ్ హీరో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ( S R Kalyanamandapam) తో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, కిరణ్ అబ్బవరం నటించిన గత చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’తో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో తన నెక్ట్స్ మూవీతో సక్సెస్ అందుకోవాలనే కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతోంది.
కాగా, తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. యూజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ తన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ‘సమ్మతమే’ చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇటీవల తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేసిన చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. చూడాలి మరి కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో.