నరేశ్‌పై నటుడు సమీర్ సీరియస్ కామెంట్స్...

ABN , First Publish Date - 2021-10-13T00:40:09+05:30 IST

‘మా’ ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. హీరో శ్రీకాంత్, బెనర్జీ, తనీశ్, ఉత్తేజ్, ప్రభాకర్... ఇలా అందరూ ఆదివారం జరిగిన ఎన్నికల గోడవ గురించి పలు విషయాలు బయటపెట్టారు.

నరేశ్‌పై నటుడు సమీర్ సీరియస్ కామెంట్స్...

‘మా’ ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. హీరో శ్రీకాంత్, బెనర్జీ, తనీశ్, ఉత్తేజ్, ప్రభాకర్... ఇలా అందరూ ఆదివారం జరిగిన ఎన్నికల గోడవ గురించి పలు విషయాలు బయటపెట్టారు. అదే క్రమంలో నటుడు సమీర్ కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాదు, ఆయన శివబాలాజీతో తనకు జరిగిన గొడవ గురించి కాస్సేపు వివరించారు. ఆయనతో తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉందని చెప్పిన సమీర్ పోలింగ్ సమయంలో జరిగిన వివాదంలో తన తప్పేం లేదని తెలిపారు.


విష్ణు ప్యానెల్ ‘మా’ సభ్యులందరికీ ఉపయోగపడే పనులు చేయాలని కోరుకున్న సమీర్, సీనియర్ నటుడు నరేశ్‌ని మాత్రం, టార్గెట్ చేశారు. ఆయన గురించి విష్ణు టీమ్‌కి ముందు ముందు తెలుస్తుంది అంటూ విమర్శించారు. ఆయన వెనుకలా ఉండగా మీరు మంచి పనులు చేయలేరంటూ సూటిగానే మాటల తూటాలు పేల్చారు. మరి  దీనిపై విష్ణు టీమ్ తరుఫు నుంచీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే, నరేశ్ వ్యక్తిగతంగా తనపై వస్తోన్న విమర్శల్ని ఎలా తిప్పికొడతారో మరి...   

Updated Date - 2021-10-13T00:40:09+05:30 IST