Samantha : డేట్ ఇచ్చేసింది!
ABN , First Publish Date - 2022-10-17T22:08:26+05:30 IST
సమంత కథానాయికగా నటిస్తున్న ‘యశోద’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. హరి–హరీష్ దర్శకుడు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు.

సమంత (Samantha)కథానాయికగా నటిస్తున్న ‘యశోద’ (Yashoda)చిత్రం విడుదల తేదీ ఖరారైంది. హరి–హరీష్ దర్శకుడు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘న్యూ ఏజ్ థ్రిల్లర్. సాధారణంగా థ్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటారు. కానీ, ఇందులో హ్యుమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం రూపొందుతుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ‘యశోద’. టైటిల్ పాత్రలో యాక్షన్ సన్నివేశాల కోసం సమంత ప్రత్యేక శిక్షణ తీసుకుని ఎఫర్ట్స్ పెట్టి క్యారెక్టర్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో సామ్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ఈ వారంలో సెన్సార్ పూర్తవుతుంది. భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. కొత్త కంటెంట్ కావాలని కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం ‘యశోద’లో ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు’’ అని అన్నారు.