Joseph Prabhu: సమంత విడాకులపై ఆమె తండ్రి భావోద్వేగ పోస్ట్

ABN , First Publish Date - 2022-09-07T22:29:17+05:30 IST

టాలీవుడ్ సెలబ్రిటీస్ సమంత (Samantha), నాగ చైతన్య (Naga Chaitanya) విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట గతేడాది అక్టోబరులో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికి షాకిచ్చారు.

Joseph Prabhu: సమంత విడాకులపై ఆమె తండ్రి భావోద్వేగ పోస్ట్

టాలీవుడ్ సెలబ్రిటీస్ సమంత (Samantha), నాగ చైతన్య (Naga Chaitanya) విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట గతేడాది అక్టోబరులో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికి షాకిచ్చారు. సామ్ విడాకుల ప్రకటన చేసిన చాలా రోజుల తర్వాత ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు (Joseph Prabhu) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సామ్ పెళ్లికి సంబంధించిన పిక్స్‌ను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేశాడు. తన ఆలోచనలను నెటిజన్స్‌తో పంచుకున్నాడు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పాడు. 


సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ‘‘చాలా కాలం క్రితం ఓ కథ ఉండేది. ప్రస్తుతం అది ఎంత మాత్రం లేదు. అందువల్ల కొత్త జీవితాన్ని, కొత్త అధ్యాయంతో ప్రారంభిద్దాం’’ అని అతడు చెప్పాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో అనేక మంది నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. ‘‘ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి’’ అని ఓ నెటిజన్ కోరాడు. ఈ కామెంట్‌కు సామ్ తండ్రి రిప్లై ఇచ్చాడు. ‘‘భావోద్వేగాలను అదుపు చేయలేక నేను చాలా కాలం బాధలో ఉన్నాను. జీవితం చాలా చిన్నది. బాధతో కుంగిపోతూ అక్కడే ఉండిపోకూడదు. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’’ అని జోసెఫ్ ప్రభు బదులిచ్చాడు. చై తో విడిపోయాక విడాకులపై సామ్ అనేక వేదికల్లో మాట్లాడింది. ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఈ విషయంపై స్పందించింది. ‘‘పెళ్లి అనేది కభీ ఖుషీ కభీ గమ్ సినిమా మాదిరిగా ఉంటుందనుకున్నాను. కానీ, ‘కెజియఫ్-3’ లాగా ఉంది. మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే పదునైన ఆయుధాలు మా కంట పడకుండా దాచాలి’’ అని సామ్ చెప్పింది. విడాకులపై నాగ చైతన్య మాత్రం ఎప్పుడు పెదవి విప్పలేదు. ‘‘సామ్ కనిపిస్తే మాత్రం ప్రేమగా కౌగిలించుకుంటా’’ అని చై పేర్కొన్నాడు. 

Updated Date - 2022-09-07T22:29:17+05:30 IST