Samantha: 1990‌ల బ్యాక్ డ్రాప్‌లో సామ్ ప్రాజెక్టు

ABN , First Publish Date - 2022-10-07T22:27:57+05:30 IST

‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ (The Family Man-2) వెబ్‌సిరీస్‌తో దేశంలోని ప్రేక్షకులందరికి చేరువైంది సమంత (Samantha). ఈ ప్రాజెక్టు ఇచ్చిన జోష్‌తో బాలీవుడ్‌కు కూడా ఆమె ఎంట్రీ ఇస్తుంది.

Samantha: 1990‌ల బ్యాక్ డ్రాప్‌లో సామ్ ప్రాజెక్టు

‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ (The Family Man-2) వెబ్‌సిరీస్‌తో దేశంలోని ప్రేక్షకులందరికి చేరువైంది సమంత (Samantha). ఈ ప్రాజెక్టు ఇచ్చిన జోష్‌తో బాలీవుడ్‌కు కూడా ఆమె ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు సంతకం చేసింది. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ ఇచ్చిన కిక్‌తో మరో వెబ్‌సిరీస్‌కు ఒకే చెప్పింది. అమెరికన్ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’ (Citadel)ను ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్టు రూపొందుతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) కీలక పాత్ర పోషిస్తున్నాడు. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. స్పై పాత్రలో సామ్ కనిపించనుందని సమాచారం. యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే..


సమంత నటించనున్న వెబ్‌సిరీస్ 1990ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం సమంత, వరుణ్ ధావన్ వర్క్‌షాప్‌లలో పాల్గొననున్నారని సమాచారం. ప్రైమ్ వీడియోలో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో ఈ వెబ్‌సిరీస్ పట్టాలెక్కనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘సిటాడెల్’ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ షోనే అనేక దేశాల్లో వేర్వేరు పేర్లతో తెరకెక్కిస్తున్నారు. ‘సిటాడెల్ మెక్సికో’, ‘సిటాడెల్ ఇటలీ’ టైటిల్స్‌తో రూపొందిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో పోరాట సన్నివేశాలు అనేకం ఉన్నాయని తెలుస్తోంది. సామ్ ప్రస్తుతం నిపుణుల సమక్షంలో అమెరికాలో పాత్ర కోసం సిద్ధమవుతుందట. అందుకోసం కఠినమైన డైట్‌ను ఫాలో అవుతుందట. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సమంత ‘శాకుంతలం’ (Shaakuntalam) షూటింగ్‌ను ఎప్పుడో పూర్తి చేసింది. ‘యశోద’, ‘ఖుషి’ (Kushi) సినిమాలలో కూడా నటిస్తుంది. ‘ఖుషి’ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతుంది. 

Updated Date - 2022-10-07T22:27:57+05:30 IST