సమంత(Samantha) – విజయ్ దేవరకొండ (Vijay devarakonda) ‘మహానటి’ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే! అప్పటి నుంచి వారిద్దరూ స్నేహితులు అయ్యారు. తాజాగా వీరిద్దరూ శివ నిర్వాణ (Shiva nirvana) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం కశ్మీర్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల అక్కడ సమంత పుట్టినరోజు వేడుకను సర్ప్రైజ్లతో నిర్వహించారు. షూటింగ్ స్పాట్లో తీరిక దొరికితే సరదాగా గడుపుతున్నారు సామ్–విజయ్. తాజా షెడ్యూల్లో షాట్ గ్యాప్‌లో హాస్యనటుడు వెన్నెల కిషోర్‌తో కలిసి ఆన్లైన్ గేమ్ ఆడారు. ఈ ఆటలో సమంత విజయం సాధించారు. విజయ్‌పై గెలవడం ఆనందంగా ఉందంటూ గేమ్ ఛార్ట్‌ను ఇన్‌స్టా స్టాటస్‌లో షేర్ చేశారు. ‘విజయ్ లాంటి వ్యక్తిపై ఆట గెలిచినప్పుడు మరింత ఆనందంగా ఉంటుంది’’ అని సామ్ రాసుకొచ్చారు. దీనికి ‘‘యుద్థం ప్రకటిస్తున్నా.. ఇప్పటి నుంచి ప్రతి విజయం రికార్డ్ అవుతుంది’’ అని విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు.
చిత్రీకరణ శరవేగంగా జరుపుకొంటున్న సమంత ‘యశోద’(Yashoda), 'శాకుంతలం’ చిత్రాల షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే ఆ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.