Nayanathara wedding : సమంత వెళ్ళలేదా?

ABN , First Publish Date - 2022-06-09T16:53:47+05:30 IST

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara) , తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan) ఈ రోజు (జూన్ 9) పెళ్ళిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. మహాబలిపురం వారి వివాహానికి వేదిక గా మారింది. కేవలం బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్ళి జరగబోతోంది.

Nayanathara wedding : సమంత వెళ్ళలేదా?

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara) , తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan) ఈ రోజు (జూన్ 9) పెళ్ళిపీటలెక్కిన సంగతి తెలిసిందే. మహాబలిపురం వారి వివాహానికి వేదికగా మారింది. కేవలం బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్ గా పెళ్ళి జరిగింది. భారీ బందోబస్త్ తో ఈ పెళ్లి జరిగింది. ఆహ్వానితుల్ని ప్రత్యేక కోడ్‌తో లోపలికి అనుమతించారు. అన్యులకు ప్రవేశం లేదు. నిన్న (జూన్ 8)  సంగీత్ కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది. ‘కాత్తువాకుల రెండు కాదల్’ (Katthu Vakkula rendu kadhal) సినిమాలో నటించినప్పటి నుంచి నయనతారతో సమంత (Samantha)కు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. నయన్ పెళ్ళి జరుగుతున్నందుకు సామ్‌‌కు బాగా ఎక్సైటింగ్‌గా ఉంది. కానీ సమంత మాత్రం నయనతార పెళ్ళికి వెళ్ళకపోవడం గమనార్హం. 


విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఖుషి’(Khushi) చిత్రం రెండో షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనవల్సి ఉండడంతో సామ్.. నయన్ పెళ్ళికి డుమ్మా కొట్టిందని టాక్. దీంతోపాటు సామ్‌కు కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకకు ఆహ్వానం అందింది. సినిమా షూటింగ్ కారణంగా సామ్.. ఆ కార్యక్రమానికి కూడా హాజరవడం లేదు. దాంతో ఇరువురి అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.  ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్ళి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పత్రికను చూసిన అభిమానులు నయన్ పెళ్ళికి వెళ్ళాలని తెగ సంబరపడ్డారు.


ఇక నయనతార పెళ్ళికి బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Sharukh Khan) కు ప్రత్యేక ఆహ్వానం అందింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జవాన్’ (Jawan) చిత్రంలో నయన్ కథానాయికగా నటిస్తుండడమే దీనికి కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు.  ఇంకా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీస్ నుంచి పలువురు ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. 

Updated Date - 2022-06-09T16:53:47+05:30 IST