సమంత, నయనతార నుంచి సాయిపల్లవి వరకు.. ఈ 10 మంది హీరోయిన్ల పారితోషికాలెంతో తెలిస్తే..!

ABN , First Publish Date - 2022-04-25T22:08:17+05:30 IST

బాలీవుడ్‌కు దీటుగా దక్షిణాది పరిశ్రమ సినిమాలు నిర్మిస్తుంది. కథ, నాణ్యత పరంగా ఎక్కడ రాజీ పడటం లేదు. కొన్ని సార్లయితే బీ టౌన్‌ను మించి చిత్రాలను రూపొందిస్తుంది.

సమంత, నయనతార నుంచి సాయిపల్లవి వరకు.. ఈ 10 మంది హీరోయిన్ల పారితోషికాలెంతో తెలిస్తే..!

బాలీవుడ్‌కు దీటుగా దక్షిణాది పరిశ్రమ సినిమాలు నిర్మిస్తుంది. కథ, నాణ్యత పరంగా ఎక్కడ రాజీ పడటం లేదు. కొన్ని సార్లయితే బీ టౌన్‌ను మించి చిత్రాలను రూపొందిస్తుంది. భారీ బడ్జెట్‌కు వెనుకాడటం లేదు. సినిమాకు హీరో, హీరోయిన్లే ముఖ్యం కాబట్టి వారి పారితోషికాలు ఆకాశనంటుతున్నాయి. మహిళా ప్రాధాన్య చిత్రాలకు కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లపై ఓ లుక్కేద్దామా..


సమంత: 

దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్స్‌ల్లో సమంత ఒకరు. కొన్నేళ్లుగా ఆమె కథా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటిస్తుంది. ‘పుష్ప’ లో ఐటం సాంగ్ చేసినందుకు దాదాపుగా రూ. 5కోట్లను రెమ్యునరేషన్‌గా అందుకుంది. కాల్షీట్స్‌ను బట్టి సమంత ఒక్కో చిత్రానికి దాదాపుగా రూ. 3కోట్ల నుంచి రూ. 8కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. 


నయనతార:

తెలుగు, తమిళ, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటి నయనతార. దక్షిణాదిలో అధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్‌ల్లో ఆమె రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు నయన్ రూ. 5కోట్ల నుంచి రూ.7కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. 



అనుష్క శెట్టి: 

‘బాహుబలి’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. స్వీటీ ఒక్కో చిత్రానికి రూ. 6కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. 


పూజా హెగ్డే: 

సౌత్‌లోని టాప్ హీరోలందరి సరసన నటించిన అందాల భామ పూజా హెగ్డే. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌,  బాలీవుడ్‌లోను మూవీస్ చేస్తుంది. కథ, డేట్స్ ను బట్టి ఆమె రూ.2.5 కోట్ల నుంచి రూ. 7కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటుంది. 


రష్మిక మందన్న: 

‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లీ‌గా కనిపించి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి రష్మిక మందన్న. ప్రస్తుతం బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఆమె రూ. 2కోట్ల నుంచి రూ.2.5కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. 


తాప్సీ: 

ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించే నటి తాప్సీ. హీరోయిన్‌గా ఆమె కెరీర్‌ను టాలీవుడ్‌లోనే ప్రారంభించింది. తాప్సీ ఒక్కో సినిమాకు రూ.3కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంది. 


కాజల్ అగర్వాల్: 

అందం, అభినయంతో ప్రేక్షకులను మైమరిపించిన అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఆమె ఒక్కో చిత్రానికి కాల్షీట్స్‌ను బట్టి రూ.1.5 నుంచి రూ. 4కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.


తమన్నా భాటియా:

చిన్నతనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన నటి తమన్నా భాటియా. ఒక్కో చిత్రానికి రూ. 4కోట్ల నుంచి రూ. 5కోట్ల వరకు ఆమె ఛార్జ్ చేస్తుంది. ఐటం సాంగ్‌లో నటిస్తే రూ. 50లక్షల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది.


రకుల్ ప్రీత్ సింగ్: 

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. బీ టౌన్‌లో వైవిధ్యమైన పాత్రలను ఆమె పోషిస్తుంది. ఒక్కో చిత్రానికి ఆమె రూ. 1.5కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంది.


సాయి పల్లవి: 

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నటి సాయి పల్లవి. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప ప్రాజెక్టుకు ఒకే చెప్పదు. ఈ ‘ఫిదా’ బ్యూటీ ఒక్కో మూవీకీ రూ. 1కోటి నుంచి రూ. 2కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. 


Updated Date - 2022-04-25T22:08:17+05:30 IST