Samantha: సమంత ఫోకస్ ఇప్పుడు ఎక్కడో తెలుసా?

ABN , First Publish Date - 2022-10-01T20:32:41+05:30 IST

తెలుగు లో అగ్ర కథానాయిక (Top actress in Telugu) అయిన సమంత (Samantha) ప్రస్తుతం విదేశంలో వున్నట్టు కరణ్ జోహార్ (Karan Johar Show) షో ద్వారా అర్థం అయింది.

Samantha: సమంత ఫోకస్ ఇప్పుడు ఎక్కడో తెలుసా?

తెలుగు లో అగ్ర కథానాయిక (Top actress in Telugu) అయిన సమంత (Samantha) ప్రస్తుతం విదేశంలో వున్నట్టు కరణ్ జోహార్ (Karan Johar Show) షో ద్వారా అర్థం అయింది. సమంత బెస్ట్ ఫిమేల్ సెలిబ్రిటీ (Best Female Celebrity) గా అవార్డు గెలిచింది అని కరణ్ వెంటనే సమంత కి ఫోన్ చేశాడు. అయితే అది ఇంటర్నేషనల్ రింగ్ అవుతోందని తనే చెప్పాడు. సమంత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ అర్థం అయిన విషయం ఏంటి అంటే, సమంత ఇండియా లో లేదు, విదేశాల్లో వుంది అని. ఇంకా ఇండియా ఎప్పుడు వస్తుందో తెలియదు అని ఆమె తదుపరి సినిమా యశోద (Yashoda) యూనిట్ లో ఒకరు చెప్పారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. అయితే సమంతా ఈ సినిమాని హిందీ (Hindi) లోకి బాగా తీసుకు వెళ్లాలని యోచిస్తోందని తెలిసింది. 


యశోద సినిమా టీజర్ (Yashoda teaser) ని ఈమధ్య విడుదల చేశారు. అయితే హైదరాబాద్ (Hyderabad) లోని సినిమాహాల్స్ లో ఈ సినిమా టీజర్ హిందీ లో చూపిస్తున్నారు ఎక్కువగా. మల్టీప్లక్స్  లో అయితే హిందీలో మాత్రమే ఈ టీజర్ చూపించాలని ఆ సినిమా నిర్మాత చెప్పాడుట, అందుకని హిందీ టీజర్ చూపిస్తున్నారు అని తెలిసింది. ఆ సినిమాలో నటిస్తున్న సమంత దగ్గర నుండి వచ్చిన ఆదేశాల మేరకే నిర్మాత, దర్శకులు ఆ టీజర్ ని ఎక్కువగా హిందీ లో ప్రోమోట్  చేస్తున్నారని తెలిసింది. 


సమంత ఈ సినిమా కోసం హిందీ లో ప్రచారం కూడా చేయాలని నిర్ణయించుకుందని కూడా తెలిసింది. పుష్ప (Pushpa)లో చేసిన ఐటం సాంగ్ (Item Song) విపరీతమయిన క్రేజ్ ఆమెకి తీసుకు వచ్చింది. అలాగే ఆమె చేసి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మేన్ (Family Man) కూడా బాగా హిట్ అవటంతో సమంతా ఫోకస్ (Samantha focus) అంతా ఇప్పుడు హిందీ (HIndi) మీదే వుంది అని తెలిసింది. 

అయితే డైరెక్ట్ గా హిందీ సినిమా చేయకపోయినా, తెలుగు సినిమానే హిందీ లోకి డబ్ చేసి (Dubbing to Hindi) ప్రోమోట్ చేయాలని భావిస్తోంది. అందుకే యశోదని హిందీ లో విడుదల చేయడానికి కరణ్ జోహార్ (Karan Johar) సహాయం కూడా తీసుకొని, పెద్దగా విడుదల చేయాలని భావిస్తోంది, అని అంటున్నారు. 

Updated Date - 2022-10-01T20:32:41+05:30 IST