Shaakuntalam: సమంత ‘శాకుంతలం’కు మోక్షం ఎప్పుడంటే?

Twitter IconWatsapp IconFacebook Icon
Shaakuntalam: సమంత శాకుంతలంకు మోక్షం ఎప్పుడంటే?

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో, భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో ర‌స‌ర‌మ్య దృశ్య కావ్యంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ప్రేక్షకలోకం ఎదురుచూస్తోంది. కానీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. ఇంత వరకు మేకర్స్ నుండి విడుదలపై ఎటువంటి క్లారిటీ రాలేదు. దీంతో అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతూ.. అసలీ సినిమాకి మోక్షం ఎప్పుడు వస్తుందో అనేలా కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. అయితే, ఆ అనుమానాలకు తెరదించుతూ.. శుక్రవారం ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రేమ కావ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో న‌వంబ‌ర్ 4న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్‌లో సమంత, దేవ్ మోహన్ (Dev Mohan) లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ (Motion Poster) వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. (Shaakuntalam Release Date)


కోట్లాదిమంది హృద‌యాల‌ను గెలుచుకున్న శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్రణ‌య‌గాథ‌ని దర్శకుడు గుణశేఖర్ ఈ ‘శాకుంత‌లం’లో చూపించబోతున్నారు. శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్.. సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. తెలుగు సినిమాకి భారీతనాన్ని తీసుకొచ్చిన వారిలో దర్శకుడు గుణశేఖర్ కూడా ఒకరు. ఆయన ఈ చిత్రంలో దుష్యంత పుర రాజ‌వంశం యొక్క వైభ‌వాన్ని గ్రాండియ‌ర్‌గా, క‌ళ్లు చెదిరేలా తెర‌కెక్కించారనే విషయాన్ని.. ఈ మోషన్ పోస్టర్ తెలియజేస్తుంది. హృదయానికి హ‌త్తుకునే క‌థ‌తో పాటు భారీ తారాగ‌ణం కూడా ఈ చిత్రంలో న‌టించారు. స‌చిన్ ఖేడ్కర్‌, క‌బీర్ బేడీ, మోహ‌న్ బాబు, ప్రకాశ్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల, జిస్సు సేన్ గుప్తా వంటివారు ప్రముఖ తారాగణంగా నటించిన ఈ చిత్రంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కుమార్తె అల్లు అర్హ (Allu Arha) యువ‌రాజు భ‌ర‌తుడి పాత్రలో న‌టించ‌టం ఈ సినిమాకి మరో ప్రధాన ఆక‌ర్షణ కానుంది. కాగా, దిల్ రాజు (Dil Raju) స‌మర్పణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ (Neelima Guna) ఈ చిత్రాన్ని నిర్మించారు. గుణశేఖ‌ర్ ర‌చ‌న, ద‌ర్శక‌త్వంలో ఆవిష్కృత‌మ‌వుతోన్న ఈ ప్రేమ కావ్యం.. బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా కాసుల వర్షాన్ని కురిపిస్తుందో తెలియాలంటే నవంబర్ 4 (November 4) వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రానికి మణిశర్మ (ManiSharma) సంగీతం అందిస్తున్నారు.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.