‘ప్రియమైన అతడితో’ అంటూ Samantha పోస్ట్

ABN , First Publish Date - 2022-06-07T02:21:45+05:30 IST

నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabu) వరుస ప్రాజెక్టులను ఒకే చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

‘ప్రియమైన అతడితో’ అంటూ Samantha పోస్ట్

నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabu) వరుస ప్రాజెక్టులను ఒకే చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడు ఓ బాలీవుడ్ హీరోతో జోడి కట్టింది. ఓ ప్రాజెక్టులో రణ్‌వీర్ సింగ్‌తో(Ranveer Singh)  కలసి నటించనుంది. ఈ సందర్భంగా అతడితో కలసి ఫొటో తీసుకుంది.  ఈ పిక్‌లో సామ్ యూనిఫాం ధరించి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ (Air Force officer)గా కనిపించింది. రణ్‌వీర్ బ్లూ షర్ట్‌లో దర్శనమిచ్చాడు. ఈ ఫొటోను సామ్ సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంది. ‘‘ప్రియమైన రణ్‌వీర్ సింగ్‌తో’’ అని సమంత ఆ పిక్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌ను రణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టాస్టోరీస్‌లో రీ షేర్ చేశాడు. సమంత, రణ్‌వీర్ కలసి ముంబైలో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


రణ్‌వీర్ సింగ్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘‘జయేష్ భాయ్ జోర్దార్’’ (Jayeshbhai Jordaar). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అతడు సమంతను ప్రశంసించాడు. సామ్ స్టెప్పులేసిన ‘ఊ అంటావా మావ’ పాట తనకెంతో ఇష్టమని పేర్కొన్నాడు. అది తన ఫేవరేట్ సాంగ్ అని చెప్పాడు. లిరిక్స్ అర్థం కానప్పటికి ఆ సంగీతం తన మనసును ఎంతగానో టచ్ చేసిందని పేర్కొన్నాడు. సమంత చివరగా ‘కాతు వక్కుల రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kaadhal) సినిమాలో నటించింది. తెలుగులో శాకుంతలం (Shaakuntalam), యశోద(Yashoda) ప్రాజెక్టులు ఉన్నాయి. విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ కూడా చేస్తుంది. హాలీవుడ్ మూవీ ‘ది అరేంజ్ మేట్స్ ఆఫ్ లవ్’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.

Updated Date - 2022-06-07T02:21:45+05:30 IST