Samantha: మూడు నెలల దాకా ‘ఊ.. ఊ’ అంటున్న సమంత.. ఎందుకలా ఫిక్స్ అయిందో..!

ABN , First Publish Date - 2022-08-18T04:06:54+05:30 IST

‘జ్ఞాపకాలు మంచివైనా, చెడ్డవైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి, మొయ్యక తప్పదు’ ఇది వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమాలోని డైలాగ్. టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన..

Samantha: మూడు నెలల దాకా ‘ఊ.. ఊ’ అంటున్న సమంత.. ఎందుకలా ఫిక్స్ అయిందో..!

‘జ్ఞాపకాలు మంచివైనా, చెడ్డవైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి, మొయ్యక తప్పదు’ ఇది వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమాలోని డైలాగ్. టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటి సమంత (Samantha) పాపం ప్రస్తుతం ఈ స్థితిలోనే ఉందేమో అనే అనుమానం సినీ జనంలో కలుగుతోంది. విడాకుల తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళుతున్నప్పటికీ ఆ పరిణామం పడదోసిన జ్ఞాపకాల సుడిగుండం నుంచి ఆమె బయటపడలేకపోతోందని ఇటీవల కొన్ని పరిణామాలు స్పష్టం చేశాయి.


మీడియా ఇంటర్వ్యూలకు (Interviews) ఆమె దూరంగా ఉండటం కూడా ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది. అంతేకాదు.. లూయిస్ హే (louise hay) రాసిన ‘యూ కెన్ హీల్ యువర్ లైఫ్’ (you can heal your life) అనే బుక్‌ సామ్ చేతిలో కంటపడేసరికి ఆమె డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉందని అర్థమైంది. పైగా.. ‘You Can Heal Your Life’ అనే పుస్తకాన్ని 1984లో లూయిస్ హే అనే అమెరికన్ రచయిత్రి రాశారు. స్వయం వికాసం, ఒక కొత్త ఆలోచన దిశగా ఎలా అడుగులు వేయాలనేది ఈ పుస్తక సారాంశం. 1984లో రాసిన పుస్తకం సమంత (Samantha Ruth Prabhu) చేతిలో కనిపించడంతో నెటిజన్లు కొంత విస్మయానికి కూడా గురయ్యారు. ఇప్పటి పుస్తకాలేవీ లేవనట్టుగా 38 ఏళ్ల క్రితం రాసిన పుస్తకాన్ని సమంత చదువుతోందన్న విషయం తెలియడమే నెటిజన్ల విస్మయానికి కారణం. ఆమెకు వయసులో పెద్ద వాళ్లు ఎవరైనా ఆ పుస్తకాన్ని సూచించి ఉండొచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది.



ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో (Bollywood) సినిమాలు చేసేందుకు కూడా సిద్ధమైన సమంత మీడియా ఇంటర్వ్యూలకు మాత్రం ముఖం చాటేస్తుండటం గమనార్హం. విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సమంత మరో మూడు నెలల వరకూ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ వ్యక్తిగతంగా ఎంతో తెగువతో ఉండే సమంత ఎందుకిలా మీడియాతో గ్యాప్ మెయింటెన్ చేయాలని భావిస్తుందోనన్న ప్రశ్న తలెత్తుతోంది. విడాకుల తర్వాత సోషల్ మీడియా సాక్షిగా తనపై ఎంత దుష్ప్రచారం జరిగినా ఏమాత్రం జంకకుండా నిలబడిన వ్యక్తి సమంత. కొందరికైతే చెంపపెట్టు లాంటి సమాధానాలతో జవాబు చెప్పింది. అలాంటి సమంత ఇంకా ఎందుకు మీడియా కంటపడకుండా ప్రైవేట్ లైఫ్ లీడ్ చేయాలని భావిస్తుందోనన్న అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది.



జీవితంలో విడాకుల లాంటి పరిణామం ఎదురైతే కొన్నాళ్లు అసౌకర్యంగా అనిపించడం సహజం. కెరీర్‌పరంగా ఎంత ముందుకు వెళుతున్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ గతం తాలూకా జ్ఞాపకాలు కళ్ల ముందు మెదలాడుతుంటాయి. ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు, ఆ జ్ఞాపకాల ఊబిలో నుంచి బయటపడి ఊపిరి పీల్చుకునేందుకు కొంత సమయం పడుతుంది. కానీ.. విడాకులు తీసుకుని దాదాపు సంవత్సరం అవుతున్నా సమంత ఇంకా మీడియాకు ముఖం చాటేయాలనుకోవడం, ఇంటర్వ్యూలకు దూరం పాటించాలనుకోవడం ఆమె మనోనిబ్బరం గురించి తెలిసిన ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తనపై వచ్చే ట్రోల్స్‌ను సమర్థంగా తిప్పికొడుతున్న సమంత పెళ్లి గురించి టీవీ షోల్లో అడిగితే మాత్రం వైరాగ్య రీతిలో సమాధానం చెబుతుండటం గమనార్హం.



‘కాఫీ విత్ కరణ్’ షోలో సమంత చేసిన వ్యాఖ్యలు కూడా వైవాహిత జీవితంపై ఆమెకున్న వైరాగ్యాన్ని మరోసారి బయటపెట్టాయి. ‘ఎంతో మంది వైవాహిక జీవితాలు అసంతృప్తిగా ఉండటానికి మీరే కారణం’ అని సమంత అనడం.. ‘మ్యారేజ్ లైఫ్ అంటే ‘కబీ ఖుషి కబీ ఘమ్’ సినిమాలా ఉంటుందని మీరు చూపించారని.. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం అది ‘కేజీఎఫ్ సినిమాలా ఉంది’ అని సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు తావిచ్చాయి. ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2017లో సమంత, నాగచైతన్య ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తొలుత ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న సమంత గత జ్ఞాపకాల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్‌పరంగా సమంతకు తెలుగులో కూడా వరుస సినిమాలే ఉన్నాయి. ‘యశోద’, ‘శాకుంతలం’, ‘ఖుషి’ సినిమాల్లో సమంత నటించింది.

Updated Date - 2022-08-18T04:06:54+05:30 IST